విశ్వక్ సేన్ హిట్ మూవీపై కన్నేసిన బాలీవుడ్ స్టార్ హీరో.. నాని చేద్దామనుకుంటే..?
బాలీవుడ్ సినిమా హీరోలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా తెలుగు సినిమాలపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ చిన్న సినిమాలు ట్రెండ్ చేస్తుండడం గుర్తిస్తున్న కొంత మంది బాలీవుడ్ హీరోలు రీమేక్ రైట్స్ కొనుక్కోవడానికి పోటీ పడుతున్నారు. ఇక రీసెంట్ గా ఒక బాలీవుడ్ స్టార్ హీరో కూడా విశ్వక్ సేన్ నటించిన హిట్ సినిమాపై కన్నేసినట్లు తెలుస్తోంది.
న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన ఆ సినిమా తెలుగులో హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపొందిన హిట్ సినిమాకు కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఇప్పుడు ఈ సినిమా కథ బాలీవుడ్ లో రీమేక్ కానున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఇద్దరు కుర్ర హీరోలు హిట్ కథపై చర్చలు జరిపారట. ఇకపోతే ఎవరికి ఇవ్వకముందే నిర్మాత దిల్ రాజు హిందీ రైట్స్ కోసం నానితో డీల్ క్లోజ్ చేసుకున్నట్లు సమాచారం.

ఇక హిందీలో దిల్ రాజు ఇప్పటికే జెర్సీ సినిమాను రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు హిట్ సినిమాను కూడా రూపొందించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. అసలైతే నాని సొంత ప్రొడక్షన్ లోనే బాలీవుడ్ లో ఈ సినిమాను ఒక యువ హీరోతో నిర్మించాలని అనుకున్నాడట. కానీ దిల్ రాజు రిక్వెస్ట్ చేయడంతో ఆయనకు మంచి ఎమౌంట్ కి రైట్స్ ఇచ్చినట్లు సమాచారం. మరి దిల్ రాజు అంతగా నమ్ముతున్న ఆ కథ నార్త్ ఆడియెన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











