twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్ నటుడికి ప్రధాని మోదీ సంతాప సందేశం..

    |

    ఎన్నికల ప్రచారంలో బిజీగా మారిన నరేంద్రమోదీ.. ప్రధాని పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాస్త రిలాక్స్ అయ్యాడు. మంత్రివర్గ ఏర్పాటు తర్వాత సాధారణ విషయాలపై దృష్టిపెట్టారు. తాజాగా బాలీవుడ్ సినీ ప్రముఖుడు, అజయ్ దేవగన్ తండ్రి వీరు దేవగన్‌ మృతికి ఆయన సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఓ సంతాప లేఖను వ్యక్తిగతం పంపించడం గమనార్హం.

    వీరు దేవగన్ 80 దశకాల్లో బాలీవుడ్ చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రఫిని అందించారు. రోటీ కపడా ఔర్ మకాన్, మిస్టర్ నట్వర్‌లాల్ లాంటి చిత్రాలకు పనిచేశాడు. అలాగే అమితాబ్ నటించిన ఓ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం సినీ ప్రముఖులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

    ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన సంతాప సందేశాన్ని హీరో అజయ్ దేవగన్‌కు పంపారు. శ్రీ వీరు దేవగన్‌ మరణంతో నేను తీవ్ర విషాదంలో మునిగిపోయాను. హిందీ చిత్ర పరిశ్రమలో పలు విభాగాల్లో విశేష సేవలు అందించారు. ఆయన మరణం తీరని లోటు అంటూ సంతాప సందేశంలో పేర్కొన్నారు.

    Narendra Modi condolence to Ajay Devgn on Veeru Devgn death

    యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా, డైరెక్టర్‌గా, నిర్మాతగా శ్రీ వీరు దేవగన్ రాణించారు. తన జీవితాన్ని సర్వస్వం సినిమా పరిశ్రమకే అంకింత చేశారు. ఆయన మరణంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వీరు దేవగన్ మృతితో బాధలో ఉన్న వారికి మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలి. వీరూ ఆత్మకు శాంతి లభించాలి అని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

    నా తండ్రి మరణంతో నా తల్లి, కుటుంబం మొత్తం విషాదంలో మునిగింది. ఆ సమయంలో ప్రధాని సంతాప సందేశం మాలో మానసిక ధైర్యాన్ని నింపింది. థ్యాంక్యూ నరేంద్రమోదీ అంటూ అజయ్ దేవగన్ ట్వీట్ చేశారు.

    English summary
    Narendra Modi condolence to Ajay Devgn on Bollywood's action Director Veeru Devgn death. Veeru was father to Ajay Devgn. Veeri was died recenlty. In this situation, PM Modi sent condolence letter and said that I am deeply saddened to learn of the demise of Shri Veeru Devgn who was widely respected for his outstanding work across various domains in the Hindi film industry. This is a great loss for the industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X