twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ నటుడు మృతి.. ప్రధాని మోడీ సంతాపం

    |

    అలనాటి బాలీవుడ్‌ ప్రముఖ నటుడు దిన్యర్‌ కాంట్రాక్టర్‌ (80) ఈ రోజు మృతి చెందారు. వృద్దాప్యంలో ఉన్న ఆయన అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 80 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దిన్యర్‌ కాంట్రాక్టర్‌ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

    'చోరీ చోరీ చుప్కే చుప్కే', 'దిల్‌ విల్‌ ప్యార్‌ వ్యార్‌', 'ఖిలాడీ', 'బాద్‌షా' వంటి ఎన్నో సినిమాల్లో నటించారు దిన్యర్‌ కాంట్రాక్టర్‌. పలు చిత్రాల్లో ఆయన చేసిన కామెడీ బాలీవుడ్ జనం ఏ నాటికి మరచిపోలేరు. ఆయన టాలెంట్ గుర్తించిన భారత ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలోనే పద్మశ్రీతో దిన్యర్‌ కాంట్రాక్టర్‌‌ని సత్కరించింది.

    కాగా ఆయన మరణ వార్త తెలిసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ వేదికగా ఆయనకు తన సంతాపం ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ''పద్మశ్రీ దిన్యర్‌ కాంట్రాక్టర్‌ ఓ నటుడిగా ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఆయన ఎక్కడుంటే అక్కడ నవ్వులు పండేవి. థియేటర్‌, టీవీ, సినిమా ఇలామీడియం ఏదైనా సరే తన అద్భుతమైన నటనతో ఎందరో ముఖాలపై చిరునవ్వులు పూయించారు. డియర్ కాంట్రాక్టర్ ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అని పేర్కొంటూ దిన్యర్‌కు షేక్‌హ్యాండ్‌ ఇస్తున్నప్పుడు దిగిన ఫొటోను షేర్ చేశారు మోడీ.

    Narendra Modi condoles Contractors death

    గత కొన్నేళ్లుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సినీ నటులతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవలే ప్రముఖ బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్.. తండ్రి వీరూ దేవ్‌గణ్ మరణం పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ వాళ్ల కుటుంబానికి మోడీ లేఖ రాసిన సంగతి తెలిసిందే.

    English summary
    On Twitter, Prime Minister Narendra Modi condoled Contractor's death, saying he is "saddened" by the veteran actor's demise.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X