twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్.. జీవితాన్ని ఇంత అర్ధాంతరంగానా? షాక్‌లో ప్రధాని మోదీ, సృతి ఇరానీ, రాజ్‌నాథ్, సంతాపం

    |

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వార్తతో సినీ, రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాయి. సుశాంత్ ఇక లేరనే వార్తతో సినీ, రాజకీయ వర్గాలు తమ సంతాపం వ్యక్తం చేస్తూ యువ నటుడికి శ్రద్దాంజలి ఘటించారు. తాజాగా సుశాంత్ మరణంపై ప్రధాని నరేంద్రమోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తదితరులు తమ సంతాపాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు. ప్రధాని మోదీ తదితరులు ఏమన్నారంటే..

    చిన్న వయసులోనే

    చిన్న వయసులోనే

    ప్రధాని మోదీ తన సంతాప ప్రకటనలో.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అద్భుతమైన భవిష్యత్ ఉన్న నటుడు. ఊహించని విధంగా చిన్న వయసులోనే ఈ లోకాన్ని వీడారు. సినిమాలు, టెలివిజన్‌ రంగంలో తన ప్రతిభతో కొద్దికాలంలో ఉన్నత శిఖరాలకు చేరుకొన్నారు. తన పెర్ఫార్మెన్స్‌తో ఎంతో మందికి స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలిచారు. ఆయన మరణం నాకు తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించింది. ఆయన కుటుంబం, అభిమానులు ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని ట్వీట్ చేశారు.

    అర్ధాంతరంగా తనువు చాలించడం

    అర్ధాంతరంగా తనువు చాలించడం

    సుశాంత్ సింగ్ మరణించారనే వార్తతో షాక్ తిన్నాను. నా నోట మాటల రావడంలేదు. అందరికి స్పూర్తి నిలుస్తున్న నీవు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం సరికాదు. బాలాజీ ప్రొడక్షన్‌ ఆఫీస్‌కు వచ్చిన రోజుల నుంచి నీవు నాకు తెలుసు. ఆ తర్వాత బాలీవుడ్‌లో ఎంత ఎత్తుకు ఎదిగావో నాకు తెలుసు. అనతికాలంలో ఊహించని లక్ష్యాలను చేధించావు. మరెన్నో ఘనతలు సాధించాల్సిన నీవు ఇలా జీవితాన్ని ముగిస్తావని అనుకోలేదు అని కేంద్రు మంత్రి స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు.

    సినీ పరిశ్రమకు తీరని లోటు: రాజ్‌నాథ్

    సినీ పరిశ్రమకు తీరని లోటు: రాజ్‌నాథ్

    సుశాంత్ మరణంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమకు తీరని లోటు అని వ్యాఖ్యానించారు. యువ నటుడి మరణవార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆయన నటనాసామర్థ్యానికి, ప్రతిభకు, స్కిల్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్తిస్తున్నాను అని అన్నారు.

    నేను, సుశాంత్ ఒకే పట్టణం నుంచి

    నేను, సుశాంత్ ఒకే పట్టణం నుంచి

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో షాక్ తిన్నాను. నా సొంత పట్టణం పాట్నా నుంచి సాధారణ యువకుడిగా ప్రయాణాన్ని మొదలు పెట్టి నటుడిగా ఎదగడం మామూలు విషయం కాదు. గతేడాది నా ప్రమాణ స్వీకారం సందర్భంగా కలిసి విషయం ఇప్పటికీ గుర్తుంది. అప్పుడు పాట్నాలోని రాజీవ్ నగర్‌లో తాను, తన ఫ్యామిలీ ఉండేవారమని చెప్పారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువ నటుడు అర్ధాంతరంగా జీవితాన్ని ముగించడం బాధాకరం అని రవి శంకర్ ప్రసాద్ అన్నారు.

    Recommended Video

    Sushant Singh Rajput Latest News And His last Instagram Post
    నటన పట్ల అంకితభావం

    నటన పట్ల అంకితభావం


    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై మాజీ కేంద్ర, సమాచార శాఖా మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎంతో జీవితం ఉన్న సుశాంత్ మరణించడం దిగ్బ్రాంతికి గురిచేసింది. అద్బుతమైన వ్యక్తి. తన రంగం పట్ల అంకితభావం నన్నెంతో ఆకట్టుకొనేవి. ఇలా జీవితాన్ని ఆయన ముగించడం సరికాదు. ఆయన కుటుంబానికి భగవంతుడు మానసిక స్థైర్యం అందించాలని ప్రార్థిస్తున్నాను అని ట్వీట్ చేశారు.

    English summary
    Actor Sushant Singh Rajput Suicide death news sent shocks to the entire film industry. Narendra modi tweeted that Sushant Singh Rajput...a bright young actor gone too soon. He excelled on TV and in films. His rise in the world of entertainment inspired many and he leaves behind several memorable performances. Shocked by his passing away. My thoughts are with his family and fans. Om Shanti.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X