twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాజీ ప్రియుడితో మళ్ళీ రొమాన్స్.. భరించలేక పారిపోయిన హీరోయిన్!

    |

    హాట్ మోడల్, బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రి ఈ మధ్య తరచుగా వార్తల్లో నిలుస్తోంది. చాలా రోజుల తర్వాత నర్గీస్ ఫక్రి బాలీవుడ్ లో అమావాస్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో సచిన్ జోషి హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల నర్గీస్ ఫక్రి వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం జరిగాయి. అమావాస్ చిత్రం కోసం నర్గీస్ ఇండియా రావడంతో ఈ రూమర్ల బెడద ఇంకా ఎక్కువైంది. నర్గీస్ ఫక్రి అమావాస్ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటుండగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

     ఇబ్బంది పెడుతున్న రూమర్స్

    ఇబ్బంది పెడుతున్న రూమర్స్

    నర్గీస్ ఫక్రి వ్యక్తిగత జీవితానికి సంబందించిన రూమర్లు ఆమెని తెగ ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది. నర్గీస్ ఫక్రి గత ఏడాది కాలంగా మాత్ అలాంజో అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంటోంది. ఇటీవల నర్గీస్ అతడి నుంచి విడిపోయినట్లు ప్రచారం మొదలైంది. అంతే కాదు నర్గీస్ ఫక్రీకి ప్రెగ్నెన్సీ అంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వీటిపై స్వయంగా నర్గీస్ ఫక్రి క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    దేశం విడచి వెళ్ళిపోయింది

    దేశం విడచి వెళ్ళిపోయింది

    ఇటీవల అమావాస్ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో నర్గీస్ ఫక్రి కూడా పాల్గొంది. ట్రైలర్ విడుదుల తర్వాత నర్గీస్ ఫక్రితో వివిధ టివి ఛానల్స్ ఇంటర్వ్యూలని నిర్మాతలు ఏర్పాటు చేశారు. దాదాపు నాలుగైదురోజుల పటు నర్గీస్ ఫక్రి ఇంటర్వ్యూలతో బిజీగా గడపాల్సింది. కానీ ఇంటర్వ్యూలని మధ్యలో వదిలేసి విదేశాలకు వెళ్లిపోయిందట. తన వ్యక్తిగత జీవితం గురించి యాంకర్స్ పదే పదే ప్రశ్నించడంతో భరించలేక పోయిన నర్గీస్ విదేశాలకు పారిపోయినట్లు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.

    మాజీ ప్రియుడితో మళ్ళీ

    మాజీ ప్రియుడితో మళ్ళీ

    మాత్ అలాంజోతో విడిపోయాక నర్గిస్ ఫక్రీ మళ్ళీ తన మాజీ బాయ్ ఫ్రెండ్ ఉదయ్ చోప్రాతో రొమాన్స్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఉదయ్ చోప్రాతో మళ్ళీ రిలేషన్ షిప్ మొదలు పెట్టారా అనే ప్రశ్న నర్గీస్ కు తీవ్రంగా చికాకు తెప్పించినట్లు తెలుస్తోంది. వరుసగా అన్ని ఇంటర్వ్యూలలో ఇదే ప్రశ్న తలెత్తుతుండడంతో నర్గిస్ సహనం నశించినట్లు తెలుస్తోంది. నర్గీస్ ఫక్రి, సచిన్ జోషి అమవాస ప్రమోషన్స్ కోసం పలు టివి షోలకు కూడా వెళ్ళాల్సింది. నర్గీస్ విదేశాలకు వెళ్లడంతో అవన్నీ క్యాన్సిల్ అయ్యాయట.

    నిర్మాణ సంస్థ కూడా

    నిర్మాణ సంస్థ కూడా

    నర్గీస్ ఫక్రీని ఇండియాకు తీసుకువచ్చి అమావాస్ ప్రమోషన్స్ లో తిరిగి పాల్గొనేలా చేయాలని ప్రొడక్షన్ హౌస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ వాళ్లకు ఆమె స్పందించడం లేదు. కారణాలు చెప్పకుండా మధ్యలో వెళ్లిపోయిందని నిర్మాణ సంస్థకు చెందిన అధికారిక ప్రతినిధులు అంటున్నారు. అమావాస్ చిత్రం ఫిబ్రవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. భూషణ్ పటేల్ ఈ చిత్రానికి దర్శకుడు.

    English summary
    Nargis Fakhri ditches Amavas promotions and leaves country.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X