సూపర్ చాన్స్ కొట్టేసిన గబ్బర్ సింగ్ కమెడియన్.. సల్మాన్ ఖాన్ సినిమాలో ఆఫర్
గబ్బర్ సింగ్ సినిమాలో కిచిడీ భాషను మాట్లాడిన కమెడియన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగు, హిందీని మిక్స్ చేసి మాట్లాడిన ఆ హాస్య నటుడు నర్రా శ్రీనివాస్. తెలుగులో హాస్య పాత్రలను పోషిస్తూ.. మంచి నటుడిగా గుర్తింపు సాధించిన నర్రాకు ఓ బంఫర్ ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో ఓ పాత్రను పోషించబోతోన్నాడు.
ఈ మేరకు నర్రా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఖాకీ సినిమాలో తన నటనను చూసిన ప్రభుదేవా మెచ్చుకున్నాడని పేర్కొన్నాడు. తన డైరెక్షన్‌లో నటించాలనే కోరిక ఉందని ప్రభుదేవాకు చెప్పానని తెలిపాడు. అలా సల్మాన్ ఖాన్ రాధే చిత్రానికి తనను ఎంపిక చేశాడనని చెప్పుకొచ్చాడు. చివరగా జరిగిన షెడ్యూల్‌లో సల్మాన్ ఖాన్‌తో కలిసి కొన్ని సీన్స్ చేసినట్టు తెలిపాడు. మొదట్లో తనతో అంతగా మాట్లాడేవారు కాదని, అయితే తాను నటించిన సీన్స్‌ను చూశాక అందరూ బాగానే ఉంటున్నారని అన్నాడు.

భాష అనేది సమస్య కాదని, అయినా తాను హైద్రాబాద్‌లో ఎన్నో యేళ్లుగా ఉండడంతో తనకు హిందీ అనేది ప్రాబ్లమ్ కాదని, తాను ఇది వరకే ఎన్నో హిందీ డైలాగ్‌లు చెప్పానని తెలిపాడు. అందుకే తనకు హిందీ సినిమాల్లో నటించడం కూడా పెద్ద ఇబ్బందేమీ కాదని తెలిపాడు. తదుపరి షెడ్యూల్‌లో దిషా పటానీతో సీన్స్ తెరకెక్కించనున్నారని అన్నాడు. సల్మాన్ ఖాన్ హీరోగా దబాంగ్ 3 తెరకెక్కించిన ప్రభుదేవా.. మళ్లీ రాధే చిత్రంతో మరో హిట్ కొట్టేందుకు సిద్దమవుతున్నారు.


Click it and Unblock the Notifications











