twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు.. షారుక్, సల్మాన్, అమీర్ మౌనం వెనుక కారణం అదే.. ప్రముఖ నటుడు సంచలన విషయాలు

    |

    మహ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి నూపూర్ శర్మ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా ఘాటుగా స్పందించాడు. అంతర్జాతీయంగా చర్చకు తెర లేపిన ఈ అంశంపై బాలీవుడ్ మౌనం వహించడం, అలాగే సూపర్ స్టార్స్ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ కూడా నోరు మెదపకపోవడంపై నసీరుద్దీన్ షా ఆశ్చర్య వ్యక్తం చేశాడు. మహ్మద్ ప్రవక్తపై నూపూర్ చేసిన వ్యాఖ్యలపై సూపర్ స్టార్స్ స్పందిస్తే.. భారీగా నష్టపోయే అవకాశం ఉంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు దేశభక్తి పేరుతో చేసే ఓ నాటకం అని వ్యాఖ్యానించారు. నసీరుద్దీన్ షా ఇంకా మాట్లాడుతూ..

    నూపూర్ శర్మ వ్యాఖ్యలపై బీజేపీ ఖండన

    నూపూర్ శర్మ వ్యాఖ్యలపై బీజేపీ ఖండన


    అయితే నూపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలు బీజేపీలో ముసలం పుట్టించింది. మిడిల్ ఈస్ట్ దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో నూపూర్ శర్మను అధికార ప్రతినిధి హోదా నుంచి తప్పించారు. అయితే ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయం. పార్టీతో ఆ వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారని నసీరుద్దీన్ షా తెలిపారు.

    బాలీవుడ్‌లో ఖాన్స్ మౌనంపై

    బాలీవుడ్‌లో ఖాన్స్ మౌనంపై


    బాలీవుడ్ ఖాన్స్ గురించి నసీరుద్దీన్ షా మాట్లాడుతూ.. నేను వారితో మాట్లాడలేను. ఈ విషయం గురించి చర్చించడానికి నాకు ఆ హోదా లేదు. ఈ వివాదంపై మాట్లాడితే వారికి ప్రొఫెషనల్‌గా ముప్పు ఉంటుందని అనుకొంటున్నారేమో. ఈ వివాదం గురించి వారి ఆత్మ పరిశీలన ఎలా ఉందో నేను ఎలా చెప్పగలను. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను. ఈ వివాదం గురించి మాట్లాడితే వారికి అన్ని రకాల ఇబ్బందులు అవుతాయని వారు భావించి ఉంటారేమో అని అనుకొంటున్నాను అని అన్నారు.

    షారుక్ ఖాన్‌ను అలా వెంటాడారని.

    షారుక్ ఖాన్‌ను అలా వెంటాడారని.

    .
    గతంలో షారుక్ ఖాన్ ఇలాంటి వివాదాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తే.. ఆర్యన్ ఖాన్ విషయంలో ఏం జరిగిందో అందరికి తెలిసిందే. మమతా బెనర్జీకి, తృణమూల్‌కు సపోర్ట్ చేసినందుకు డ్రగ్స్ కేసులో ఆర్యన్‌ను ఇరికించిం.. షారుక్ ఖాన్‌ను వెంటాడి ఎన్ని తిప్పలు పెట్టారో తెలుసు. అందుకే ఆయన నోరుమెదపడం లేదు. ఇంకా సోనుసూద్ నివాసాలపై ఐటీ దాడులు చేయించారు. ఇప్పుడు నేను ఇలా మాట్లాడితే.. నన్ను టార్గెట్ చేయవచ్చేమో. ఏదైనా జరుగొచ్చు అంటూ నసీరుద్దీన్ షా వ్యాఖ్యలు చేశారు.

    వాళ్లనే దేశభక్తులుగా

    వాళ్లనే దేశభక్తులుగా


    జాతీయభావంతో సినిమాలు తీసే దర్శకులు, నటులను దేశభక్తులుగా చిత్రీకరిస్తున్నారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాను రూపొందించిన వివేక్ అగ్నిహోత్రి, సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాలో నటించిన అక్షయ్ కుమార్ లాంటి వాళ్లను కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నది. కశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రభుత్వం ప్రమోట్ చేసింది అని నసీరుద్దీన్ షా తెలిపారు.

    ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ...

    ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ...


    షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను ముంబై నుంచి గోవాకు వెళ్లే క్రూయిజ్‌లో డ్రగ్స్ వినియోగిస్తున్నాడనే ఆరోపణలతో ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. కొన్ని వారాలపాటు జైలులో ఉంచిన తర్వాత బెయిల్‌పై ఆర్యన్ బయటకు వచ్చారు. ఇటీవల డ్రగ్స్ కేసులో సాక్ష్యాలు లేనందున ఆర్యన్ నిర్దోషి అంటూ ఎన్సీబీ క్లీన్ చీట్ ఇచ్చింది.

    English summary
    Actor Naseeruddin Shah comments on Salman, Shah Rukh and Aamir silence on Prophet Muhammad contraversy. Recently, Naseeruddin Shah comments on Prophet Muhammad contraversy goes viral. He asked why Salman, Shah Rukh and Aamir silence on Prophet Muhammad contraversy
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X