National Awards 2025: బాలీవుడ్ నుంచి ముగ్గురికి జాతీయ పురస్కారం.. బెస్ట్ నటీనటులు వీరే

71వ జాతీయ పురస్కారాల జాబితా 2025 ఆగస్టు 1న వెల్లడైంది. ఆయా కేటగిరీల్లో ఎంపికైన వారి పేర్లతో పూర్తి జాబితాను నేషనల్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధికారికంగా వెల్లడించింది. 332 ఫీచర్ ఫిల్మ్స్, 115 నాన్ ఫీచర్ ఫిల్మ్స్ నుంచి కమిటీకి అప్లికేషన్స్ అందగా విశ్లేషించి తుది జాబితాను ప్రకటించారు. కాగా బాలీవుడ్ లో 2023లో తమ చిత్రాలతో సంచలనం సృష్టించిన నటీనటులను ఈసారి ఉత్తమ యాక్టర్స్ ప్రకటించారు. హిందీ చిత్ర పరిశ్రమ నుంచి ఈ పురస్కారం ఎవరెవరికి దక్కిందనే వివరాల్లోకి వెళితే..

బెస్ట్ యాకర్ట్ గా షారుఖ్ ఖాన్..
బాలీవుడ్ స్టార్ హీరో, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన 2023 బ్లాక్ బాస్టర్ పిల్మ్ జవాన్. అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 1100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూల్ చేయడం విశేషం. ఇక ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ నటనకు గానూ 71వ నేషనల్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా అవార్డ్ ను సొంతం చేసుకున్నారు. అయితే షారుఖ్ ఖాన్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డ్స్ అందినా బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ అందడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక నేషనల్ అవార్డ్ అందుకున్న సందర్భంగా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. మరోవైపు అదే ఏడాది పఠాన్, ఢంకీ అనే చిత్రాలతోనూ ప్రేక్షకులను అలరించారు.

National Awards 2025 Bollywood Stars Shah Rukh Khan and Vikrant Maasey got Best National Actor

12th ఫెయిల్ చిత్రంతో విక్రాంత్ కు..
బాలీవుడ్ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన 12th ఫెయిల్ చిత్రానికి ఎంతటి ప్రశంసలు అందాయో తెలిసిందే. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ చంబల్ వాసి నిజ జీవిత కథను తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. విధు వినోద్ దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే కు జాతీయ పురస్కారం లభించింది. అలాగే బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో దర్శకుడు విధు వినోద్ చోప్రా, నిర్మాతకు అవార్డ్ ను ప్రకటించడం విశేషం.

ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీకి కూడా బెస్ట్ యాక్ట్రెస్ విభాగంలో నేషనల్ అవార్డ్ దక్కడం విశేషం. మిస్ ఛటర్జీ వర్సెస్ నార్వే అనే చిత్రంలో తన అద్భుతమైన నటనకు జాతీయ అవార్డ్ ను ప్రకటించారు. మరోవైపు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా విజయరాఘవన్ పూల్కలం చిత్రానికి గానూ, ముత్తుపెట్టై సోము భాస్కర్ పార్కింగ్ అనే చిత్రానికి గాను అవార్డ్ ను సొంతం చేసుకున్నారు. బెస్ట్ యాక్ట్రెస్ విభాగంలో జాంకి బోడివాలా వాష్ చిత్రంలోని నటనకు, ఊర్వశి ఉలజుక్కు అనే చిత్రంలోని నటనకు అవార్డ్ ను దక్కించుకున్నారు.

తెలుగులో..
తెలుగులో బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ ను నందమూరి బాలయ్య నటించిన భగవంత్ కేసరికి ప్రకటించారు. అలాగే 2023లో ప్రేక్షకులను అలరించిన బెస్ట్ చిత్రాల్లో బేబీ, హనుమాన్ సినిమాలు ఉండటం విశేషం. బేబీ చిత్రానికి గానూ ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో సాయి రాజేష్ నీలం, మేల్ ప్లేబ్యాక్ సింగర్ విభాగంలో పీవీఎన్ ఎస్ రోహిత్, గాంధీ తాత చెట్టు చిత్రంలో నటంచిన దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డ్ ను సొంతం చేసుకుంది. ఇక హనుమాన్ చిత్రం బెస్ట్ యానిమేషన్, విజువల్స్, గేమింగ్, కామిక్స్ విభాగంలో బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ ను సొంతం చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X