ఐశ్వర్యరాయ్‌ని అనవసరంగా కెలికాడు... ఇబ్బందుల్లో ప్రముఖ నటుడు!

Recommended Video

Vivek Oberoi Responds On Aishwarya Rai Meme Post || Filmibeat Telugu

జాతీయ మహిళా కమీషన్(ఎన్‌సిడబ్ల్యు) బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌కు నోటీసులు జారీ చేసింది. ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్‌ను ఉద్దేశించి సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు చేయడమే ఇందుకు కారణం. ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌ను ఉద్దేశించి వివేక్ ఒబెరాయ్ కొన్ని వెటకారపు మీమ్స్ షేర్ చేసిన సంగతి తెలిసిందే.

వివేక్ ఒబెరాయ్ షేర్ చేసిన పోస్టుపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఐశ్వర్యరాయ్ వ్యక్తిగత జీవితాన్ని అవమానించే విధంగా ఈ పోస్ట్ ఉందని, సోషల్ మీడియాలో ఇలాంటి నీచమైన పోస్టులు చేయడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

వివేక్ ఒబెరాయ్ క్షమాపణలు చెప్పాలి

వివేక్ ఒబెరాయ్ క్షమాపణలు చెప్పాలి

వివేక్ ఒబెరాయ్ సోషల్ మీడియాలో ఐశ్వర్యరాయ్ గురించి షేర్ చేసిన పోస్టుపై వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేనిచో తగిన చర్యలు తీసుకోవాల్సి ఉటుందని జాతీయ మహిళా కమీషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ పేర్కొన్నారు. ఒక బాధ్యతగల నటుడిగా ఆయన ఇలాంటి చర్యకు పాల్పడాల్సింది కాదన్నారు.

లీగల్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్

లీగల్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్

వివేక్ ఒబెరాయ్... ఐశ్వర్యరాయ్ గురించి తను షేర్ చేసిన పోస్టుపై సోషల్ మీడియాతో పాటు, వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పాలని... లేకుంటే లీగల్ యాక్షన్ తీసుకుంటామని రేఖా శర్మ హెచ్చరించారు. సోషల్ మీడియా నుంచి అతడు చేసిన ట్వీట్ రిమూవ్ చేసేలా ట్విట్టర్‌ సంస్థకు నోటీసులు పంపినట్లు తెలిపారు.

వివేక్ ఒబెరాయ్ ఏం ట్వీట్ చేశారు

వివేక్ ఒబెరాయ్ ఏం ట్వీట్ చేశారు

ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌ను ఉద్దేశించి వివేక్ ఒబెరాయ్ ఒక పోస్ట్ చేశారు. అందులో ఓపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్, అసలైన రిజల్ట్ అంటూ మూడు ఫోటోలు ఉన్నాయి. ఐశ్వర్యరాయ్-సల్మాన్ ఖాన్ ఉన్న ఫోటోకు ఒపీనియన్ పోల్ అని, వివేక్ ఒబెరాయ్-ఐశ్వర్యరాయ్ ఉన్న ఫోటోకు ఎగ్జిట్ పోల్ అని, ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ ఉన్న ఫోటోకు అసలైన ఫలితం అంటూ క్యాప్షన్ పెట్టడం వివాదాస్పదం అయింది.

ఐశ్వర్యరాయ్-వివేక్ ఒబెరాయ్ రిలేషన్

ఐశ్వర్యరాయ్-వివేక్ ఒబెరాయ్ రిలేషన్


గతంలో ఐశ్వర్యరాయ్, సల్మాన్ ఖాన్ ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ గొడపడి విడిపోయిన తర్వాత వివేక్ ఒబోరాయ్‌తో ఆమె ప్రేమలో పడ్డట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ ఇద్దరినీ కాకుండా ఐశ్వర్యరాయ్ చివరకు అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకున్నారు. ఇలా ఐశ్వర్య జీవితంలో జరిగిన మూడు సంఘటనలకు ముడిపెడుతూ ఎగ్జిట్ పోల్స్ మీద సెటైర్లు వేయడం అభిమానులతో పాటు మహిళా వాదులకు ఆగ్రహం తెప్పించింది.

ట్వీట్ డిలీట్ చేసి క్షమాపణ చెప్పాడు

ఐశ్వర్యరాయ్ గురించి తాను చేసిన ట్వీట్ వివాదాస్పదం కావడంతో వివేక్ ఒబెరాయ్ ఒక మెట్టు దిగాడు. క్షమాపణలు చెప్పడంతో పాటు ట్వీట్ డిలీట్ చేశారు. తనకు మహిళలంటే ఎంతో గౌరవమని, అది సరదాగా చేసిన ట్వీట్ తప్ప ఎవరినీ బాధించాలనే ఉద్దేశ్యం తనకు లేదన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X