నిర్మాతగా మారుతున్న స్టార్ హీరోయిన్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు కేవలం యాక్టింగ్‌కు మాత్రమే పరిమితమైన ఈ బ్యూటీ మరో అడుగు ముందుకేసి నిర్మాతగా మారారు. ప్రొడ్యూసర్‌గా తన తొలి ప్రయత్నంలో 'నట్‌ఖట్' అనే షార్ట్ ఫిల్మ్ నిర్మిస్తున్నారు.

'నట్‌ఖట్' షార్ట్ ఫిల్మ్‌ నిర్మించడం మాత్రమే కాదు ఇందులో ఆమె నటిస్తున్నారు కూడా. షాన్ వ్యాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రోనీ స్క్ర్యూవాలా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనుకంప హర్ష్, శ్యామ్ వ్యాస్ కథ అందించారు.

Natkhat Produced by Ronnie Screwvala and Vidya Balan

విద్యా బాలన్ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆమె నెర్కొండ పార్వాయ్ అనే తమిళ చిత్రంలో చేస్తున్నారు. అజిత్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం 'పింక్' రీమేక్. బోనీ కపూర్ నిర్మాత. విద్యా బాలన్ నటిస్తున్న తొలి తమిళ చిత్రం ఇది.

విద్యా నటించిన మరో చిత్రం 'మిషన్ మంగళ్' ఆగస్టు 15న విడుదల కాబోతోంది. ఇస్రో ప్రయోగించిన 'మంగళయాన్' ఉపగ్రహ ప్రయోగం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో అక్షయ్ కుమార్ రాకేష్ ధావన్ అనే సైంటిస్ట్ పాత్రలో నటిస్తుండగా... విద్యా బాలన్ తారా షిండే పాత్ర పోషిస్తోంది. ఇంకా సోనాక్షి సిన్హా, తాప్సీ, నిత్యా మీనన్, కీర్తి కుల్హరి, షర్మాన్ జోషి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జగన్ శక్తి దర్శకత్వం వహించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X