ఛాన్స్ ఇస్తానని .. ఒంటిపై బట్టల్లేకుండా, ఆ డైరెక్టర్ బతుకు బయటపెట్టిన బేబీ హీరోయిన్
అన్ని పరిశ్రమల మాదిరిగానే చిత్ర పరిశ్రమలోనూ నటీనటుల మధ్య ప్రేమాయణాలు, ఇతర చీకటి వ్యవహారాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ఇండస్ట్రీలో మహిళా నటులపై వేధింపుల వ్యవహారాలు బయటపడుతూనే ఉన్నాయి. మీ టూ ఉద్యమంతో పాటు గతేడాది మలయాళ చిత్ర పరిశ్రమపై బహిర్గతమైన జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ ఇండస్ట్రీలో మహిళా నటులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వేధింపుల గురించి కుండబద్ధలు కొట్టాయి.
సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు, స్త్రీలపై వివక్ష గురించి రోజుకొకరు బాంబు పేలుస్తూ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నారు. కొద్దిరోజుల క్రితం మలయాళ నటుడు షైన్ టామ్ చాకో , హీరోయిన్ విన్సీల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. సెట్‌లో మహిళా నటులకు రక్షణ లేకుండా పోయిందని పలువురి నిజ స్వరూపాలను బయటపెడుతున్నారు. హీరోలు, దర్శక నిర్మాతలు, చివరికి లైట్ బాయ్‌ల నుంచి కూడా హీరోయిన్స్‌కు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెట్‌లో ఉన్న మగవాళ్ల బుద్ధి ఒకేలా ఉండేదని, ప్రతి ఒక్కరికీ హీరోయిన్‌లని లొంగదీసుకోవాలని ఉండేదని బాలీవుడ్ నటి, గాయనీ కునిక సదానంద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

హిందీ టీవీ రంగంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు నవీనా బోలే. ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ భరత నాట్యం నేర్చుకుని పలు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ క్రమంలో మోడలింగ్ వైపు అడుగులు వేసిన నవీన .. ఇండియాలో టాప్ బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరించారు. వీటిలో ఫెయిర్ అండ్ లవ్లీ, డాబర్ వాటిక, ఫెయిర్ వన్, రిలయన్స్, నోకియా యాడ్స్ ప్రధానమైనవి. మ్యూజిక్ వీడియోలతోనూ నవీన దుమ్మురేపారు. జగ్జిత్ సింగ్, గులాం అలీ, డీజే జయంత పాఠక్, డీజే తరల్‌లతో కలిసి ఆల్బమ్స్ చేశారు.
తొలుత ఆమెకు హిందీ టెలివిజన్ రంగం నుంచి పిలుపొచ్చింది. ఫేమస్ క్రైమ్ సిరీస్ సీఐడీతో పాటు సప్నా బాబుల్ కా బిడాయీ, బాగో ఆయా, మిలే జబ్ హమ్ తుమ్, అదాలత్, రామ్ మిలాయీ జోడీ, లవ్ జిందగీ, అలీ బాబా, సుమిత్ సంబాల్ లెగా వంటి సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నిర్మాత, నటుడు కరణ్ జిత్‌తో డేటింగ్ చేసిన నవీన 2017లో ఆయనను పెళ్లాడింది. అయితే అనివార్య కారణాలతో ఈ జంట 2024లో విడాకులు తీసుకుంది.సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే నవీన హాట్ హాట్ ఫోటో షూట్‌లతో రెచ్చగొడుతుంటారు.
తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్‌పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా నటులతో ఆయన ప్రవర్తన ఏమాత్రం బాగోదని.. సాజిద్ కారణంగా తాను ఎంతో ఇబ్బంది పడ్డానని అన్నారు. 20 ఏళ్ల క్రితం ఓ ప్రాజెక్ట్ కోసం సాజిద్ టీమ్ నుంచి తనకు పిలుపు రావడంతో ఆయనను కలవడానికి వెళ్లినట్లు నవీన వెల్లడించారు. మాట్లాడటానికి వెళ్తే బట్టలు తీసేసి కూర్చోమన్నాడని.. ఆ మాటలతో తనకు షాక్ తగిలినట్లయ్యిందని ఆమె గుర్తు చేసుకున్నారు.
తనకు భయం వేసి తన ఫ్రెండ్స్ బయట వెయిట్ చేస్తున్నారని చెప్పి ఇంటికి వచ్చేశానని నవీన తెలిపారు. ఈ సంఘటన తర్వాత నవీన తనకు వరుస ఫోన్ కాల్స్ చేశారని.. కానీ వాటికి తాను స్పందించలేదని, అంతేకాదు జీవితంలో మరోసారి సాజిద్‌ను కలవకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నవీన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో చర్చనీయాంశమవ్వగా దీనిపై సాజిద్ ఖాన్ స్పందించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











