కంగన అలాంటిది కాదు... స్వర మాటల్లో నిజంలేదు- నవ్నీ పరిహార్

సుశాంత్ సింగ్ మరణానాంతరం నెపోటిజంపై ఉద్యమిస్తున్న కంగనా రనౌత్ ను నిలవరించేందుకు ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా, ఆమె మాత్రం ఇసుమంతైనా వెనక్కు తగ్గడంలేదు. సొంత పరిశ్రమ నుంచే ఆమెకు తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. అదే విధంగా ఆమెకు మద్ధతు ఇస్తున్న వారి సంఖ్యకూడా గణణీయంగా పెరుగుతూనే ఉంది.

ఇక ఇటీవలే తను వెడ్స్ మనులో తన కోస్టా్ర్ అయిన స్వరా భాస్కర్ తోపాటూ, తాప్సీని కూడా బీ గ్రేడ్ నటిమణులుగా పేర్కొన్న కంగనపై, ఇద్దరూ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారనే చెప్పాలి. ఇంతలో స్వరా అభిమాని ఒకరు, మరో అడుగు ముందుకేసి "తను వెడ్స్ మను" సెట్స్ లో కంగన స్వరపై నోరుపారేసుకుందన్న విషాయాన్ని గుర్తుచేయగా, దానికి ఆమె కూడా ఇలాంటి మద్దు ఇంకా కావాలని ట్వీట్ చేసింది. అయితే ఇదంతా నిజంకాదని, మరో నటి కంగనకు మద్దతుగా స్టేట్మెంట్ ఇచ్చి, స్వరాకు గట్టి ఝలక్కే ఇచ్చింది.

Navni parihar denis Swara Bhaskars claims, supports Kangana

"తను వెడ్స్ మను"లో కంగనకు తల్లిగా నటించిన నవ్నీ పరిహార్, కంగన ఎవరి మీదా నోరు పారేసుకునే రకం కాదని స్పష్టం చేశారు. ఒక వేళ స్వరపై ఆమె అరిచిన మాట వాస్తవం అయి ఉంటే అది అందరికీ తెలుస్తుందని వెల్లడించారు. షూటింగ్ సమయంలో తన వరకూ ఎప్పుడూ అలాంటి వార్తలు రాలేదని, కాబట్టి అందులో నిజం ఉండే అవకాశాలు చాలా తక్కువ అని స్పష్టం చేశారు. ఇక కంగన సెట్స్ లో అసలు ఎవరితోనూ మాట్లాడదని, కేవలం తన పనిపైనే దృష్టిపెట్టి పనిచుసుకుంటుందని నవ్నీ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X