నాపై తప్పుడు లైంగిక ఆరోపణలు.. 100 కోట్ల నష్టపరిహారం చెల్లించండి.. కోర్టుకు నవాజుద్దీన్ సోదరుడు!
బాలీవుడ్‌లో విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ సోదరుడు షమాసుద్దీన్ సిద్దిఖీ కోర్టు మెట్లెక్కాడు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు పత్రికపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు. ఓ హీరోయిన్ తనపై ఆరోపణలు చేసినట్టు రాసిన కథనంతో తనకు జరిగిన మానసిక నష్టానికి న్యాయం చేయాలని షామసుద్దీన్ సిద్ధిఖీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. షామాసుద్దీన్ బాలీవుడ్ చిత్రం బోలే చుడియాన్‌కు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. షమాసుద్దీన్ సిద్ధిఖీ కలిగిన నష్టంపై కోర్టులో వేసిన పిటిషన్‌లో ఏమున్నదంటే...

నాపై లైంగిక ఆరోపణలతో
నాపై అసత్యపు లైంగిక ఆరోపణలను తన కథనంలో ఓ ప్రముఖ పత్రిక ప్రచురించింది. నా ప్రవర్తన కారణంగా మౌనీరాయ్ అనే హీరోయిన్‌తోపాటు మరికొందరు హీరోయిన్లు నా సోదరుడు నవాజుద్దీన్ సిద్ధిఖీతో నటించడానికి వెనుకాడుతున్నారు. సిగ్గుతో పారిపోతున్నారు. నా ప్రవర్తన అభ్యంతరకరంగా ఉంటుందని హీరోయిన్లు ఆరోపిస్తున్నారు అని ఓ పత్రిక కథనంలో పేర్కొన్నది. ఈ వ్యాఖ్యలపై షామాసుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పత్రిక కథనంతో పరువు నష్టం
నా ప్రవర్తన కారణంగా నాతో కలిసి పనిచేయడానికి వెనుకాడుతున్నారు అని రాయడం నాకు మనస్తాపం కలిగించింది. ఆ పత్రిక కథనంలో నా ప్రతిష్ఠకు తీవ్ర నష్టం కలిగింది. నా గౌరవానికి భంగం కలిగింది. అందుచేత నాకు రూ.100 కోట్ల నష్టపరిహారం చెల్లించాలి అని షామాసుద్దీన్ సిద్ధిఖీ పిటిషన్ దాఖలు చేశారు.

నవాజుద్దీన్ సిద్ధిఖీ ఏమన్నారంటే
అయితే తన సోదరుడి వివాదంపై ఇంకా నవాజుద్దీన్ సిద్దిఖీ స్పందించలేదు. అయితే గతంలో మౌనీ గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. మౌనీ ఇంకా పరిణతి చెందని నటి. ఇంకా తన నటనను ఇంకా పరీక్షించుకొనే స్థితిలోనే ఉంది. బోలే చుడియాన్ కథకు ఆమె ఫర్‌ఫెక్ట్ చాయిస్ అని నవాజుద్దీన్ సిద్ధిఖీ అన్నారు.

ఎవరీ మౌనీ రాయ్.. ఏమా కథ
గోల్డ్ అనే చిత్రం ద్వారా అక్షయ్ కుమార్‌తో కలిసి వివాదాస్పద నటి మౌనీరాయ్ బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి బోలే చుడియాన్ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం అక్టోబర్‌లో రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ఆమె ఈ వివాదంలోకి ఇరుక్కోవడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











