మీకు కనీసం సిగ్గుందా? దేశాన్ని కరోనా పట్టి పీడుస్తుంటే.. విదేశాల్లో శృంగారమా? సీనియర్ యాక్టర్ ఫైర్..
దేశంలో కరోనావైరస్ పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయి. దేశంలో అనేక మంది కరోనా బారిన పడటమే కాకుండా మరణానికి అంచున చేరుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే వీటన్నిటిని పట్టించుకోకుండా సెలబ్రిటీలు మాల్దీవుల్లాంటి దేశాలకు విహార యాత్రలకు వెళ్లడంపై విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన దేశంలోని పరిస్థితులు వివరిస్తూ.. తారలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ..

దేశంలో చేజారుతున్న పరిస్థితులు
కరోనావైరస్ విజృంభించడం కారణంగా రోజు రోజుకు పరిస్థితులు చేజారిపోతున్నాయి. గత 24 గంటల్లో దాదాపు 3.5 లక్షల కేసులు నమోదు అయ్యాయి. దాదాపు 2624 మంది మృతి చెందారు. దాదాపు 1.5 కోట్ల మంది ఇప్పటి వరకు రికవరీ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ప్రజలు అవస్థలు పడుతుంటే
దీంతో దేశంలో పరిస్థితులు గంభీరంగా మారుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందక రోగులు విపత్కర పరిస్థితుల్లో కూరుకుపోతున్నారు. హాస్పిటల్స్ బెడ్స్ లేక, మెడిసిన్ లభించక అవస్థలు పడుతున్నారు అని మీడియా కథనాలు వెలువడుతున్నాయి.

సెలబ్రిటీలు లవర్స్‌తో కలిసి
ఇలాంటి గంభీరమైన పరిస్థితుల్లో కొందరు సెలబ్రిటీలు ఎయిర్‌పోర్టులో ఫోటోలు దిగుతూ.. లేదా తమ లవర్స్‌తో విదేశాల్లో విహారయాత్రలు చేస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలపై పలువురు సోషల్ మీడియాలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

నవాజుద్దీన్ సిద్ధిఖీ ఫైర్
ఇలాంటి పరిస్థితుల్లో నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.. కొందరు తారలు తమకు తాముగా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రపంచం మొత్తం దారుణమైన పరిస్థితుల్లో కూరుకుపోతుంటే సెలబ్రిటీలు వాళ్ల విహార యాత్రల ఫోటోలు, బికినీ అందాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు అని అన్నారు.

విలాసాలకు విచ్చల విడిగా ఖర్చులు
దేశంలో చాలా మంది కనీస అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు లేక అవస్థలు పడుతుంటే.. మీరు మాత్రం విలాసాలకు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. సరే మీరు విహార యాత్రలకు వెళ్తే సరే కానీ.. ఇలాంటి పరిస్థితుల్లో ఫోటోలు షేర్ చేయడం అవసరమా? .. కనీసం సిగ్గు తెచ్చుకోవాలి అంటూ నవాజుద్దీన్ సిద్దిఖీ పేర్కొన్నారు.

మాల్దీవుల్లో బాలీవుడ్ తారలు
దేశంలో కరోనావైరస్ కేసులు భారీగా పెరుగుతుంటే.. బాలీవుడ్ ప్రముఖులు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, మాధురీ దీక్షిత్, జాన్వీ కపూర్, సారా ఆలీ ఖాన్, టైగర్ ష్రాఫ్, దిశా పటానీ తదితరులు మాల్దీవుల్లో పర్యటించారు. నవాజుద్దీన్ సిద్దిఖీ తన సొంత పట్టణం బుదానాలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











