వరుసకు కూతురే అయినా.. చిన్నతనం నుంచి అలా తాకేవాడు.. నవాజుద్దిన్ సోదరుడిపై ఫిర్యాదు

బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ చుట్టూ వివాదాలు అల్లుకుంటున్నాయి. మొన్నటి వరకు తన భార్య ఆలియా సిద్దిఖీ విడాకులు కోరడం, ఆమెపై ఆసత్య ఆరోపణలు చేయడం, వాటిని ఆమె ఖండించడంతో నవాజుద్దీన్ పేరు వార్తల్లో తెగ చక్కర్లు కొట్టింది. ఆ వ్యవహారం కాస్త చల్లబడిందని అనుకునే లోపే మరో వివాదం మెడకు చుట్టుకుంది. నవాజుద్దీన్ సోదరుడిపై కూతురు వరుస అయినా అమ్మాయే లైంగిక ఆరోపణలు చేసిన ఘటన దుమారం రేపుతోంది. అసలు ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

నవాజుద్దీన్ విడాకుల వ్యవహారం..

నవాజుద్దీన్ విడాకుల వ్యవహారం..

బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ విడాకుల వ్యవహారాం ఎంతగానో వైరల్ అయింది. మే 7న నవాజుద్దీన్ భార్య ఆలియా సిద్దిఖీ వాట్సప్ మెయిల్ ద్వారా విడాకుల నోటీస్ పంపింది. అయితే నవాజుద్దీన్ మాత్రం ఇంత వరకు స్పందించలేదు.

తాజాగా మరో సమస్య..

తాజాగా మరో సమస్య..

బాలీవుడ్‌ విలక్షణ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ తమ్ముడు.. తొమ్మిదేళ్ల వయసులో తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని వారి కూతురు(వరుసకు) పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలోని జమీనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మరో సమస్య నవాజుద్దీన్ నెత్తిన పడింది.

అలా తాకే వాడు..

అలా తాకే వాడు..

మీడియా మాట్లాడిన ఆమె.. ‘నాకు రెండేళ్లు ఉన్నపుడు మా అమ్మానాన్న విడిపోయారు. మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నారు. తొమ్మిదేళ్ల వయసులో మా చిన్నాన్న‌( నవాజుద్దీన్‌ తమ్ముడు)నన్ను అసభ్యంగా తాకేవాడు. నేను ఎంతో హింసకు గురయ్యాను. నాకప్పుడు ఆ విషయం అర్థం అయ్యేది కాదు. పెద్దయ్యాక అతడి చేష్టలను గుర్తించాను. పెళ్లైన తర్వాత కూడా వారి(నటుడి కుటుంబం) వేధింపులు తగ్గలేదు. మా అత్తింటి వారిపై తప్పుడు కేసులు పెట్టి హింసించేవార'ని తెలిపింది.

ఆయన కూడా అలానే వారు..

ఆయన కూడా అలానే వారు..

అయితే తన చిన్నాన్న పెట్టే బాధలను పెదనాన్న అయిన నవాజుద్దీన్‌కు చెబితే అర్థం చేసుకుంటారని అనుకుందట. అయితే నవాజుద్దీన్ మాత్రం.. ‘చిన్నాన్న కదా అలా ఎప్పుడూ చేయలేరు' అని సర్ది చెప్పేవాడట. ఈ విషయాలన్నీ తాజాగా మీడియా ముందు చెప్పేసరికి ఈ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X