ఆయనకు నాకు కొడుకు పుట్టలేదా? నన్ను రేప్ చేశాడు.. నవాజుద్దీన్‌ సిద్దిఖీపై భార్య సంచలన ఆరోపణలు

బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దీఖీ, ఆయన భార్య ఆలియా సిద్దిఖీ మధ్య తలెత్తిన దాంపత్యపరమైన వివాదం అనేక మలుపులు తిరుగుతున్నది. రకరకాల ఆరోపణలతో ఈ వివాదం ట్విస్టులతో మంచి ఫ్యామిలీ సినిమాను తలపిస్తున్నది. తాజాగా నవాజుద్దీన్ సిద్దిఖీపై ఆలియా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి మధ్య వివాదం ఏమిటి? బాంబే హైకోర్టు చేసిన సూచనలు ఏమిటనే విషయంలోకి వెళితే...

 నవాజుద్దీన్ సిద్దిఖీ వైవాహిక జీవితంలో

నవాజుద్దీన్ సిద్దిఖీ వైవాహిక జీవితంలో


నవాజుద్దీన్ సిద్దిఖీ వైవాహిక జీవితంలోని కలతలు జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. వారిద్దరి మధ్య దూరం కొద్దికాలంగా పెరుగుతూనే ఉన్నది. అంతేకాకుండా పిల్లల సంరక్షణ అంశం వారి మధ్య మరింత గ్యాప్‌ను పెంచుతున్నది. తాజాగా సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేసిన ఆలియా.. నాపై నవాజుద్దీన్ సిద్దిఖీ రేప్ చేశాడు అంటూ ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నా పిల్లల్ని ఆయన కస్టడీ నుంచి తప్పించండి అంటూ వీడియోలో ఆలియా పేర్కొన్నది.

పిల్లల సంరక్షణ బాధ్యత గురించి

పిల్లల సంరక్షణ బాధ్యత గురించి


ఇదిలా ఉండగా, పిల్లల సంరక్షణ బాధ్యత గురించి ముంబై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా కోర్టులో నవాజుద్దీన్ సిద్దిఖీ తల్లిపై ఆలియా సంచలన ఆరోపణలు చేశారు. నా కొడుకు నవాజుద్దీన్ సిద్దిఖీకి పుట్టలేదని ఆయన తల్లి కామెంట్స్ చేసింది అంటూ ఆలియా కోర్టుకు తెలియజేసింది. నవాజ్, నాకు నా బిడ్డ పుట్టలేదని ఆయన తల్లి చేసిన ఆరోపణల విషయాన్ని కోర్టు దృష్టికి తేవడంతో సంరక్షణ వ్యవహరం కొత్త మలుపు తిరిగింది.

కోర్టు బయటే పరిష్కరించుకోండి..

కోర్టు బయటే పరిష్కరించుకోండి..


నవాజుద్దీన్ సిద్దిఖి, ఆలియా ఫిర్యాదులు, వాదనలు విన్న తర్వాత హైకోర్టు వారిద్దరికి కీలక సూచనలు చేసింది. పిల్లల సంరక్షణ బాధ్యత విషయంలో భార్యాభర్తలిద్దరు సానుకూలంగా ఓ నిర్ణయానికి రావడానికి ఇద్దరు చర్చలు జరుపుకోవాలి. కోర్టు తీర్పు కంటే పిల్లల బాధ్యతను స్వీకరించే విషయంలో వారిపైనే ఎక్కువ బాధ్యత ఉంది. ఈ వివాదాన్ని కోర్టు బయట సానుకూలంగా పరిష్కరించుకొంటే.. బాగుంటుంది అని కోర్టులో న్యాయమూర్తి సూచించారు.

నా బిడ్డకు తండ్రి ఎవరో తెలియదు..

నా బిడ్డకు తండ్రి ఎవరో తెలియదు..


కోర్టులో ఆలియా తన వాదనను వినిపిస్తూ.. నా కొడుకు తండ్రి ఎవరో తెలియదు. పుట్టిన తర్వాత నా బిడ్డను ముట్టుకొన్న దాఖలాలు కూడా చాలా తక్కువ. నా బిడ్డ కోసం సమయాన్ని కేటాయించిన సందర్బాలు చాలా తక్కువ. నా బిడ్డ పుట్టిన సమయంలో దుబాయ్‌లో చాలా తక్కువ రోజుల మాత్రమే మాతో ఉన్నాడు అని ఆలియా వెల్లడించింది.

 నవాజుద్దీన్ మొక్కుబడిగా మాత్రమే

నవాజుద్దీన్ మొక్కుబడిగా మాత్రమే


నవాజుద్దీన్ సిద్దిఖీతో నేను కలిసి ఉన్న రోజుల్లో, నా సంసారం సవ్యంగా సాగుతున్న నేపథ్యంలో కూడా ఎన్నడూ నా బిడ్డలను చూసుకొన్న పాపాన పోలేదు. మొక్కుబడిగా వారిని పలకరించేవారు. ఎప్పుడో వచ్చినప్పుడు గిఫ్టు తీసుకొచ్చి ఏదో ప్రేమను చూపించేవాడు అని ఆలియా ఆవేదన వ్యక్తం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X