ఇకపై అలా చేస్తే చట్టపరమైన చర్యలు.. భార్యకు నోటీసులు ఇచ్చిన నవాజుద్దీన్ సిద్దిఖీ
నవాజుద్దీన్ సిద్దిఖీ, అలియా వ్యవహారం బాలీవుడ్‌ను వేడెక్కిస్తోంది. గతంలో వీరిద్దరి విడాకుల విషయం మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. లాక్ డౌన్ సమయంలో ఎంతో ఆలోచించాని, ఇంత వరకు తాను ఏం కోల్పోయానో తెలిసి వచ్చిందని అలియా చెబుతూ.. నవాజుద్దీన్‌కు విడాకుల నోటీసు పంపినట్టు తెలిపింది. ఆ విషయం జరిగి దాదాపు రెండు నెలలు అవుతుంటే తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది. నవాజుద్దీన్ తన భార్యకు లీగల్ నోటీసు పంపి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. ఇంతకీ ఆ నోటీసులో ఏముందో ఓ సారి చూద్దాం.

విడాకుల వ్యవహారం వైరల్..
అలియా విడాకులు కోరినా నవాజుద్దీన్ స్పందించడం లేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. పైగా తనను అగౌరవ పర్చాలని, లేనిపోని సంబంధాలను అంటగడుతున్నారని అలియా వాపోయింది. నిజానిజాలు బయట పెట్టేందుకే తాను సోషల్ మీడియాలో ప్రవేశించానని తెలిపింది.

భరణం చెల్లించడం లేదు..
నవాజుద్దీన్ గురించి చెబుతూ వరుస ట్వీట్లతో నానా రచ్చ చేసింది. మెయింటెనెన్స్ కింద నెల నెల డబ్బులు చెల్లించాలని కోరినా నవాజుద్దీన్ ఇంతవరకు స్పందించలేదని తెలిపింది. అతడు డబ్బులు పంపించకపోవడం వల్ల పిల్లల స్కూలు ఫీజులు చెల్లించలేకపోతున్నాని వాపోయింది.

నెల నెలా చెల్లిస్తున్నాడు..
తాజాగా నవాజుద్దీన్ అలియాకు నోటీసులు పంపాడు. ఈ మేరకు అతడి తరపు న్యాయవాది అద్నాన్ షేక్ మీడియాతో మాట్లాడాడు. అలియా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పరువు నష్టం కలిగిస్తుందని నవాజుద్దీన్ నోటీసులో పేర్కొన్నాడట. ఆమె పంపిన నోటిసుకు నవాజుద్దీని సకాలంలోనే స్పందించాడని, తను నోటీసులో పేర్కొన్నట్లుగానే నెలవారి భత్యం చెల్లిస్తున్నాడని తెలిపాడు.
Recommended Video

అలా చేస్తే చట్టపరమైన చర్యలు..
చెల్లింపులకు సంబంధించిన వివరాలు, స్క్రీన్‌షాట్‌లు కూడా ఉన్నాయని, పిల్లలకు సంబంధించిన ఖర్చులన్నింటినీ లాక్‌డౌన్‌కు ముందే అలియాకు చెల్లించాడని లాయర్ చెప్పుకొచ్చాడు. అయినా నవాజుద్దీన్‌కు అతడి కుటుంబానికి పరువు నష్టం కలిగించేందుకు ఉద్దేశపూర్వకంగా అలియా తప్పుడు ఆరోపణలు చేస్తోందని, అందుకే ఈ లీగల్ నోటీసులు పంపించాడని తెలిపాడు. ఇక మీదట అలాంటి ఆరోపణలు చేస్తే తనపై చట్టబద్దమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు.


Click it and Unblock the Notifications











