నవాజుద్దీన్ సిద్ధిఖీకి భార్య షాక్.. విడాకుల కోసం లీగల్ నోటీసులు
విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదంలో చిక్కుకొన్నారు. దాంపత్య జీవితంలో తీవ్రమైన విభేదాలు తలెత్తడంతో ఆయన భార్య ఆలియా విడాకులు ఇవ్వాలంటూ ఆయనకు నోటీసులు పంపింది. అంతేకాకుండా విడాకుల అనంతరం తనకు జీవిత భత్యాన్ని కూడా అందించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
మీడియా రిపోర్టుల ప్రకారం.. పెళ్లి తర్వాత ఏడాది నుంచి మా మధ్యలో విభేదాలు తలెత్తాయి. నవాజ్‌తో ఒక్క విషయంలో కాదు.. చాలా విషయంలో అంతర్గత విభేదాలు ఉన్నాయి. అవి పరిష్కరించుకోలేని దిశగా వెళ్లిన క్రమంలో విడాకులు తీసుకోవడమే ఉత్తమం అనే నిర్ణయానికి వచ్చాం అని వెల్లడించారు.

2010 నుంచి మా దాంపత్య జీవితంలో మధ్య సరైన అవగాహన లేదు. అందుకే విడిపోవడానికే నిర్ణయించుకొన్నాం అని పిటిషన్లో పేర్కొన్నారు. నవాజుద్దీన్ సిద్దిఖీకి ఆయన భార్య నోటీసులు పంపిన విషయం నిజమే. మే 7 తేదీ 2020 రోజున లీగల్ నోటీసులను ఈమెయిల్, వాట్సాప్ ద్వారా పంపాం అని ఆలియా తరుఫు న్యాయవాది వెల్లడించారు. అయితే నవాజుద్దీన్ సిద్ధిఖీ విడాకుల నోటీసులపై స్పందించలేదు.
నవాజుద్దీన్, ఆలియా సిద్ధిఖి పదేళ్ల క్రితం పెళ్లి చేసుకొన్నారు. వారిద్దరికి ఇద్దరు సంతానం ఉంది. 2017 నుంచి వారి మధ్య విభేదాలు చోటుచేసుకొన్నాయనే వార్తలు మీడియాలో వస్తున్నాయి.
అయితే మే 19 తేదీన జన్మదినం జరుపుకొంటున్న నవాజుద్దీన్‌కు అదే రోజు భార్య ఇలాంటి చేదు అనుభవాన్ని మిగల్చడంపై బాలీవుడ్‌లో అనేక కథనాలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











