»   » నా మొగుడు దేవుడు..అప్పట్లో విడాకుల వార్త, ఇప్పుడు నటుడిపై నీచంగా!

నా మొగుడు దేవుడు..అప్పట్లో విడాకుల వార్త, ఇప్పుడు నటుడిపై నీచంగా!

Subscribe to Filmibeat Telugu

ఎలాంటి పాత్రనైనా అలవోకగా పోషించగల ప్రతిభాశాలి నవాజుద్దీన్ సిద్దిఖీ. విలక్షణమైన పాత్రలతో నవాజుద్దీన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నవాజుద్దిన్. భార్య విషయంలో నవాజుద్దీన్ వైఖరి గురించి షాక్ కి గురిచేసే వార్తలు వస్తున్నాయి. నవాజుద్దీన్ తన భార్య అంజలి విషయంలో రహస్యంగా డిటెక్టివ్ పనులు చేస్తున్నాడని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. భార్యపై సీక్రెట్ గా నిఘా పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది అని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటుండడం ఆసక్తిగా మారింది.

విలక్షణ నటుడు

విలక్షణ నటుడు

విలక్షణ పాత్రలతో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నవాజుద్దీన్ కు బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది. తాజాగా ఆయన గురించి షాక్ కి గురిచేసే వార్తలు వస్తున్నాయి.

 నవాజుద్దీన్ డిటెక్టివ్ పనులు

నవాజుద్దీన్ డిటెక్టివ్ పనులు

నవాజుద్దీన్ తన భార్యపై అనుమానంతో డిటెక్టివ్ పనులు చేస్తూ ఆమెపై నిఘా పెట్టినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన భార్య వ్యవహారాల్ని గమనించడానికి ఆయన ఓ సీక్రెట్ డిటెక్టివ్ ని నియమించారని ఈ విషయం పోలీస్ ల విచారణలో తేలిందని సదరు మీడియా పేర్కొంది.

డిటెక్టివ్ ఎందుకు

డిటెక్టివ్ ఎందుకు

తన భార్యపై నవాజుద్దీన్ సీక్రెట్ గా నిఘా ఎందుకు పెట్టాడని బాలీవుడ్ అభిమానులు, ప్రముఖులు సైతం చర్చించుకుంటున్నారు. దీనిపై పోలీస్ లు విచారణ జరుపుతున్నారు.

 పోలిసుల విచారణలో తేలింది

పోలిసుల విచారణలో తేలింది

కొందరు తమ కాల్ డేటా ని ట్రాప్ చేతున్నారని పోలీస్ లకు ఫిర్యాదు చేసారు. ఈ కేసులో విచారణ జరిపిన పోలీస్ లు అనుమానితులని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరి విచారణలో నవాజుద్దీన్ భార్య అంజలి కాల్ డేటా కూడా వారి వద్ద ఉన్నట్లు తెలుస్తోంది.

అయన చెప్పాడు..అందుకే చేసాం

అయన చెప్పాడు..అందుకే చేసాం

నవాజుద్దీన్ తన భార్యపై నిఘా పెట్టమని ఆదేశించడం వలనే ఈ పనిచేశామని వారు పోలీస్ ల ముందు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం లేకున్నా బాలీవుడ్ లో ఓ వర్గం మీడియా మాత్రం ఈ కథనం వెలువరించింది.

కట్టు కథనం అంటూ ఖండించాడు

కట్టు కథనం అంటూ ఖండించాడు

ఈ వార్తలని నవాజుద్దీన్ ఖండించారు. మీడియాలో వస్తున్న వార్తలు కట్టు కథలు మాత్రమే అని నవాజుద్దీన్ కొట్టి పారేశాడు. కానీ ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు. దీనితో ఆయన భార్య అంజలి స్వయంగా రంగంలోకి దిగింది.

 మా ఆయన దేవుడు

మా ఆయన దేవుడు

మీడియాలో ఎడతెరిపిలేకుండా తమ గురించి వస్తున్న వార్తలకు అంజలి ఫుల్ స్టాప్ పెట్టె ప్రయత్నం చేసింది. మా ఆయన దేవుడు అంటూ సర్టిఫికెట్ ఇచ్చేసింది. నిన్నటి నుంచి మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అని అంజలి అన్నారు. మా ఆయన అలాంటి వారు కాదని అంజలి తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఏ విషయాన్ని ఆమె తెలియజేసారు.

 విడాకులు తీసుకున్నారంటూ

విడాకులు తీసుకున్నారంటూ

గతంలో కూడా తాము విడాకులు తీసుకున్నాం అంటూ వార్తలు సృష్టించారని అంజలి తెలిపింది.ఇలాంటి పుకార్లు సాధారణంగా వచ్చేవే కదా అని తాము అప్పుడు స్పందించలేదు. కానీ నవాజుద్దీన్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని వాపోయింది. అందుకే తాను క్లారిటీ ఇస్తున్నానని పేర్కొంది.

 నేను బ్రాహ్మణ అమ్మాయిని

నేను బ్రాహ్మణ అమ్మాయిని

తాను బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చానని అంజలి తెలిపింది. నవాజుద్దీన్ ముస్లిం. మేమిద్దరం కులాంతర వివాహం చేసుకుని అన్యోన్యంగా జీవిస్తున్నాం. దయచేసి ఇలాంటి నీచమైన వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలని అంజలి కోరింది.

English summary
Nawazuddin Siddiqui wife responds on call data issue. She says that Nawazuddin is innocent.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu