సుశాంత్ మరణం కేసులో మరో ట్విస్టు.. కీలక సూత్రధారి అరెస్ట్.. మళ్లీ తెరపైకి రియా చక్రవర్తి, షోవిక్ పేర్లు!

బాలీవుడ్‌లో సద్దుమణుగుతుందనుకొంటున్న డ్రగ్స్ కేసు మరోసారి కలకలం సృష్టించింది. ఈ కేసులో అరెస్ట్ అయి బెయిల్‌పై బయటకు వచ్చిన రియా చక్రవర్తి, షోవిక్ చక్రవర్తి పేర్లు తాజా అరెస్ట్‌తో మరోసారి బయటకు వచ్చాయి. ముంబైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు మళ్లీ కొరడా ఝులిపించి డ్రగ్స్ సప్లయిదారుడిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ గురించి ఎన్సీబీ అధికారులు వివరిస్తూ..

డ్రగ్స్ దందాలో కీలక సూత్రధారి

డ్రగ్స్ దందాలో కీలక సూత్రధారి

ముంబై శివారులోని లోకండ్‌వాలా ప్రాంతంలో ఎన్సీబీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో డ్రగ్స్ వ్యవహారాల్లో కీలక సూత్రధారి రీగెల్ మహాకాల్‌ను అరెస్ట్ చేశాం. ఆయన విచారిస్తూ మరింత సమాచారాన్ని సేకరిస్తున్నాం అని ఎన్సీబీ జోనల్ అధికారి వెల్లడించారు.

గతంలో రియా, షోవిక్ చక్రవర్తికి డ్రగ్స్ సరఫరా

గతంలో రియా, షోవిక్ చక్రవర్తికి డ్రగ్స్ సరఫరా

ముంబైలో పేరు మోసిన రీగెల్ మహాకాళిపై గతంలో పలు ఆరోపణలు వచ్చాయి. బాలీవుడ్ హీరోయిన్లకు, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తికి డ్రగ్స్ సరఫరా చేశారనే విషయం పలు వాట్సప్ ఛాట్స్‌, ఇతర అంశాల ఆధారంగా వివరాలు సేకరించాం. వాటి ఆధారంగానే రీగెల్‌న ఫాలో చేస్తున్నాం అని ఎన్సీబీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

భారీగా పట్టుబడ్డ నగదు, డ్రగ్స్

భారీగా పట్టుబడ్డ నగదు, డ్రగ్స్

రీగెల్ మహాకాళి నివాసంలో జరిపిన మెరుపుదాడుల ఫలితంగా భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకొన్నాం. పెద్ద మొత్తంలో నగదు, హై క్వాలిటీ మలానా క్రీమ్ స్వాధీనం చేసుకొన్నాం. కోర్టులో హాజరుపరిచి మళ్లీ కస్టడీని కోరుతాం. రీగెల్‌ను పూర్తిస్థాయిలో విచారిస్తే మరింత కీలక సమచారం లభించే అవకాశం ఉంది అని ఎన్సీబీ వెల్లడించింది.

ఇటీవలే బెయిల్‌పై రియా, షోవిక్ విడుదల

ఇటీవలే బెయిల్‌పై రియా, షోవిక్ విడుదల

డ్రగ్స్ కేసులో అరెస్ట్‌ అయిన రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తి ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ కేసులో రియా నెల రోజులపాటు జైలులో ఉండగా, షోవిక్ చక్రవర్తి దాదాపు మూడు నెలలపాటు కస్టడీలో ఉన్నారు. రియా చక్రవర్తి అక్టోబర్ 7న బెయిల్‌పై విడుదల కాగా, షోవిక్ చక్రవర్తి డిసెంబర్ 2వ తేదీన బెయిల్‌పై విడుదల అయ్యారు.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
బాలీవుడ్‌లో మళ్లీ కలకలం

బాలీవుడ్‌లో మళ్లీ కలకలం

ఇదిలా ఉండగా, రీగెల్ మహాకాళి అరెస్ట్‌తో బాలీవుడ్ సినీ తారలు మరోసారి ఉలిక్కి పడ్డారు. ఎన్సీబీ విచారణలో మహాకాళి నోట ఎవరి పేర్లు బయటకు వస్తాయనే భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. రీగెల్ మహాకాళికి రియా, షోవిక్, అనూజ్ కేశవానితో బలమైన సంబంధాలున్నాయనే ఆరోపణలు రావడంతో మళ్లీ ఆ ఇద్దరిని విచారించే అవకాశం ఉందనే ఊహాగానాలు బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X