సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ కేసు: స్నేహితుడిని అరెస్ట్ చేసిన ఎన్సీబీ!
బాలీవుడ్ నటుడు, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) మరోసారి పంజా విసిరింది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న అధికారులు సుశాంత్ స్నేహితుడు, అసిస్టెంట్ డైరెక్టర్ రిషికేష్ పవార్‌ను అదుపులోకి తీసుకొన్నారు. అయితే ఈ కేసు గురించి ఎన్సీబీ అధికారులు వివరణ ఇస్తూ...

డ్రగ్స్ సప్లయర్ల నుంచి షోవిక్, దీపేష్
గత ఏడాది డ్వేన్ అనే డ్రగ్స్ సప్లయర్ నుంచి 50 గ్రాముల గంజాయి, అలాగే రిషికేష్ పవార్ నుంచి 100 గ్రాముల గంజాయిని రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ వంట మనిషి దీపేష్ సావంత్ తీసుకొన్నారు. ఈ విషయంపై రిషికేష్‌కు సమన్లు జారీ చేశాం. గత సెప్టెంబర్ నుంచి విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు అని ఎన్సీబీ అధికారులు తెలిపారు.

రిషికేష్ పవార్ కోసం గాలింపు
సుశాంత్ మరణం కేసులో డ్రగ్స్ కోణంపై దర్యాప్తు చేస్తున్న ఎన్సీబీ ఈ ఏడాది జనవరి 8వ తేదీన రిషికేష్ పవార్ కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో పలు వ్యక్తులను ఆరా తీయగా రిషికేష్ జాడను కనుగొన్నాం. ఆయనను ఓ ప్రాంతంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నాం అని ఎన్సీబీ అధికారులు తెలిపారు.

రిషికేష్ పవార్‌ను విచారిస్తే..
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు రిషికేష్ పవార్ స్నేహితుడు. పలు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ కేసులో రిషికేష్‌ను విచారిస్తే చాలా విషయాలు బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం రిషికేష్‌ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం అని ఎన్సీబీ అధికారులు తెలిపారు.
Recommended Video

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మరణం
గతేడాది జూన్ 14వ తేదీన సుశాంత్ సింగ్ ముంబైలోని తన నివాసంలో అనుమానాస్పద పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ వంట మనిషి దీపేష్ సావంత్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారు బెయిల్‌పై బయటకు వచ్చారు.


Click it and Unblock the Notifications











