బ్రేకింగ్: పోలీసుల అదుపులో రియా చక్రవర్తి సోదరుడు.. డ్రగ్స్ కేసులో ఎన్సీబీ పంజా
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) శుక్రవారం ఉదయం మెరుపుదాడులు నిర్వహించింది. గురువారం జైద్ విలాత్రా మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత దర్యాప్తు వేగాన్ని మరింత ఉధృతం చేసింది. శుక్రవారం ఉదయమే సుశాంత్ మేనేజర్ శ్యామూల్ మిరాండా, రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి నివాసాలపై ఏకధాటిగా మెరుపు దాడులు నిర్వహించింది. అనంతరం శ్యామూల్, షోవిక్ చక్రవర్తిలకు సమన్లు జారీ చేసి వారిని అదుపులోకి తీసుకోవడం సంచనలనంగా మారింది. ఈ దర్యాప్తు గురించి వివరాల్లోకి వెళితే...
Recommended Video

పొంతన లేని సమాధానాలతో
గత కొద్దిరోజులుగా డ్రగ్స్ సప్లయిర్స్ చెప్పిన విషయాలకు, శ్యామూల్ మిరాండా, షోవిక్ చక్రవర్తి, రియా చక్రవర్తి చెప్పిన విషయాలకు పొంతన లేకపోవడంతో ఈ కేసు దర్యాప్తును మరింత ఉధృతం చేశారు. ఈ కేసులో మరింత సమాచారం సేకరించేందుకు శ్యామూల్, రియా నివాసాలపై ఎన్సీబీ ఏకకాలంలో మెరుపుదాడులు నిర్వహించింది.

షోవిక్, శ్యామూల్‌ను అదుపులోకి
రియా చక్రవర్తి, షోవిక్ చక్రవర్తి, శ్యామూల్ మిరాండా నివాసాలపై సుమారు నాలుగు గంటలపాటు సోదాలు నిర్వహించిన తర్వాత షోవిక్, శ్యామూల్‌ను అదుపులోకి తీసుకొన్నట్టు సమాచారం. శుక్రవారం తమ కార్యాలయంలో వారిని సంయుక్తంగా విచారించనున్నట్టు తెలిసింది. డ్రగ్స్ సప్లయర్లు చెప్పిన విషయాలు వీరిద్దరూ చెప్పిన విషయాలు సరితూగకపోవడంతో ఎన్సీబీ అధికారులు ఈ నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం.

షోవిక్ ల్యాప్ ట్యాప్ సీజ్
రియా చక్రవర్తి నివాసంపై దాడులు, సోదాలు నిర్వహించిన అనంతరం ఆమె ఇంటి నుంచి షోవిక్ చక్రవర్తి లాప్‌టాప్, ఇతర డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకొన్నట్టు సమాచారం. తాజాగా జైద్ విలాత్రా, బాసిత్‌తో ఉన్న సంబంధాలపై ప్రశ్నించునున్నట్టు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే బాసిత్‌ను కస్టడీలోకి తీసుకొన్నారు.

ఎన్సీపీ అధికారికంగా వెల్లడి
రియా చక్రవర్తి నివాసంపై దాడులు నిర్వహించిన తర్వాత నార్కోటిక్స్ బ్యూరో జోనల్ డిప్యూటీ డైరెక్టర్ ఎంకే జైన్ అధికారికంగా మీడియాకు కొన్ని విషయాలు వెల్లడించారు. షోవిక్ చక్రవర్తి, రియా చక్రవర్తి నివాసాలపై దాడులు నిర్వహించాం. వారిని సంయుక్త విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేశాం. ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద వారిని విచారిస్తాం అని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications











