రియా మెడకు డ్రగ్స్ ఉచ్చు.. విదేశాలకు సందీప్ సింగ్ జంప్.. మాస్టర్ ప్లాన్ గుట్టురట్టు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో రంగంలోకి దూకిన ఈడీ, సీబీఐ అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గత రెండు రోజులుగా ఈ కేసు విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రియా చక్రవర్తికి డ్రగ్ మాఫియాతో లింకులు ఓ పక్క, సందీప్ సింగ్ ఫోన్ కాల్ డేటా లీక్ వ్యవహారం బాలీవుడ్‌ను, మీడియాను కుదిపేశాయి. అయితే ఈ కేసులో సందీప్ సింగ్, రియా చక్రవర్తి మెడకు ఉచ్చు బిగుస్తున్నదనే సంకేతాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో వెలుగులోకి వచ్చిన మరిన్ని సంచలన విషయాలు..

సందీప్ సింగ్ విదేశాలకు పారిపోయేందుకు

సందీప్ సింగ్ విదేశాలకు పారిపోయేందుకు

సుశాంత్ కేసు దర్యాప్తును ఈడీ, సీబీఐ దర్యాప్తు చేపట్టిన తర్వాత కొన్ని విషయాల్లో భారీ మార్పులు చోటుచేసుకొన్నాయి. కేసు తీవ్రత మరింత జటిలంగా మారడంతో సుశాంత్ సింగ్ స్నేహితుడినని స్వయంగా ప్రకటించుకొన్న సందీప్ సింగ్ విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించినట్టు తాజాగా బయటకు వచ్చింది.

 తప్పించుకొని లండన్‌కు వెళ్లే ప్రయత్నం

తప్పించుకొని లండన్‌కు వెళ్లే ప్రయత్నం

సుశాంత్ కేసును దర్యాప్తు ఊపందుకోవడంతో సందీప్ సింగ్ లండన్‌కు పారిపోవాలని ప్రయత్నం చేశాడు. తన పీఆర్ ఏజెన్సీ సహాయంతో వీసా ఏజెన్సీలను సంప్రదించాడు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో విదేశాలకు పారిపోలేకపోయాడనే వార్తలు మీడియాలో భారీగా వినిపించాయి.

సందీప్ ఫోన్ కాల్ డేటా లీక్‌తో గుట్టురట్టు

సందీప్ ఫోన్ కాల్ డేటా లీక్‌తో గుట్టురట్టు

సుశాంత్ మరణం తర్వాత అంబులెన్స్ డ్రైవర్‌తో సందీప్ సింగ్ పలుమార్లు మాట్లాడటంపై అనేక అనుమానాలు రేకెత్తాయి. అలాగే కేసును దర్యాప్తు చేసే పోలీసు అధికారి, ఆయన సహాయకుడితో పదే పదే ఫోన్‌లో మాట్లాడే విషయం తాజా ఫోన్ డేటాలో స్పష్టమైంది. అంబులెన్స్ డ్రైవర్‌తో నాలుగుసార్లు దాదాపు ఐదు నిమిషాలకుపైనే మాట్లాడినట్టు సమాచారం. అలాగే కేసు విచారణ అధికారి భుషన్ బెల్నేకర్‌త జూన్ 15, జూన్ 17న పలుమార్లు మాట్లాడినట్టు లీకైన ఫోన్ కాల్ డేటాలో స్పష్టమైంది.

 రియా చక్రవర్తిపై మరో కేసు

రియా చక్రవర్తిపై మరో కేసు

ఇక డ్రగ్ మాఫియాతో రియా చక్రవర్తికి సంబంధాలున్నట్టు వాట్సాప్ ఛాట్ స్పష్టం చేయడంతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. రియా చక్రవర్తిపై కేసు నమోదు చేసి ఆమెను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే ఈడీ, సిబీఐ దర్యాప్తుతో బెంబేలెత్తిన రియాకు ఎన్సీబీ విచారణతో మరో ఉచ్చు బిగిసిందనే మాట వినిపిస్తున్నది.

Recommended Video

Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
డ్రగ్ లింకు వ్యవహారంపై విచారణ

డ్రగ్ లింకు వ్యవహారంపై విచారణ


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో దర్యాప్తు చేస్తున్న తాము డ్రగ్స్ వాడకం, కొనుగోలు అంశాలు బయటకు రావడంతో కేసు నమోదు చేశామని ఎన్సీబీ డీజీ రాకేశ్ అస్థానా మీడియాకు స్పష్టం చేశారు. నార్కోటిక్, డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 20, 27, 29 ప్రకారం కేసు నమోదు చేశాం ఆయన తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X