రియా చక్రవర్తిపై క్రిమినల్ కేసు నమోదు.. బిగుసుకొంటున్న ‘డ్రగ్’ కేసు ఉచ్చు

బాలీవుడ్ నటి రియా చక్రవర్తిపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) క్రిమినల్ కేసు నమోదు చేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో డ్రగ్ కోణాన్ని ఈడీ అధికారులు దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్సీబీ డ్రగ్స్ లింకులపై కేసు నమోదు చేయడం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో రియా చక్రవర్తిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తూ ఎన్సీబీ అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

Recommended Video

Actress Rhea Chakraborty reached at DRDO guest house for CBI questioning | Oneindia Telugu
 గోవా హోటల్ యజమానిని విచారించిన సీబీఐ

గోవా హోటల్ యజమానిని విచారించిన సీబీఐ

ముంబైలోని డ్రగ్ మాఫియా, సప్లైదారులతో రియా చక్రవర్తికి సంబంధించిన వాట్సాప్ ఛాట్ వెలుగులోకి రావడంతో ఎన్సీబీ, సీబీఐ అధికారులు వేగంగా స్పందించారు. గోవాకు చెందిన హోటల్ యజమాని గౌరవ్ ఆర్యతో రియా జరిపిన వాట్సాప్ చాటింగ్ లీక్ కావడంతో ఎన్సీబీ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో సోమవారం డ్రగ్ లింకులపై గౌరవ్ ఆర్యను సీబీఐ కూడా విచారించింది. డ్రగ్ లింకులను సీబీఐతోపాటు ఎన్సీడీ కూడా దర్యాప్తు చేస్తున్నది.

 బాలీవుడ్‌తో డ్రగ్ లింకులపై కొరడా

బాలీవుడ్‌తో డ్రగ్ లింకులపై కొరడా

రియా చక్రవర్తితో జయా సహ, గౌరవ్ ఆర్య చాటింగ్ వ్యవహారం బయటకు రావడంతో ఈడీ అధికారులు అప్రమత్తమయ్యారు. సుశాంత్ కేసులో విచారించాలని నార్కోటిక్ బ్యూరోకు ఈడీ లేఖ రాసింది. దాంతో ఈ కేసును విచారించనున్నట్టు ఎన్సీబీ చీఫ్ రాకేష్ అస్థానా స్పష్టం చేశారు. ఈ క్రమంలో బాలీవుడ్‌లో డ్రగ్ మూలాలను కదిలించే ప్రయత్నం చేస్తున్నది.

బాలీవుడ్‌తో మరో ఇద్దరికి లింకులు?

బాలీవుడ్‌తో మరో ఇద్దరికి లింకులు?

బాలీవుడ్‌తో డ్రగ్ మాఫియా లింకులపై దర్యాప్తు చేపట్టిన ఎన్సీబీ అధికారులు తాజాగా మరో ఇద్దరిని గుర్తించింది. డ్రగ్స్ సప్లయిదారులు ఫారుఖ్ షేక్ అలియాస్ ఫరూక్ బటాటా, బకుల్ చండాలియాతో బాలీవుడ్ ప్రముఖులకు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నది. ఈ ఇద్దరిని కూడా ఈ కేసులో విచారించే అవకాశం ఉంది.

రియాపై క్రిమినల్ కేసు నమోదు

రియాపై క్రిమినల్ కేసు నమోదు

ఇప్పటికే రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిపై నార్కోటిక్ యాక్టు కింద సెక్షన్ 20, 22, 27, 29 ప్రకారం ఎన్సీబీ కేసు నమోదు చేసింది. ఈ డ్రగ్స్ కేసులోనే రియాపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రియాపై కేసు బుక్ చేసింది. రియాపై క్రిమినల్ కేసును నమోదు కావడంతో ఆమె మెడకు మరో కేసు చిక్కుకున్నట్టు స్పష్టమవుతున్నది.

 ఐదో రోజు కూడా రియాను విచారించనున్న సీబీఐ

ఐదో రోజు కూడా రియాను విచారించనున్న సీబీఐ

సుశాంత్ మరణం కేసులో రియా చకవ్రర్తిని వరుసగా నాలుగో రోజు విచారించింది. సోమవారం ఆమెను దాదాపు 9 గంటలపాటు అధికారులు ప్రశ్నించారు. సీబీఐ విచారణ అనంతరం రియా రాత్రి తొమ్మిది గంటలప్రాంతంలో డీఆర్డీవో గెస్ట్‌హౌస్‌ను విడిచి వెళ్లడం మీడియా కంటపడింది. ఇక ఈ కేసులో వరుసగా ఐదో రోజు కూడా అంటే మంగళవారం కూడా రియాను విచారించేందుకు సీబీఐ అధికారులు సమన్లు జారీ చేయడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X