బ్రేకింగ్: NCB Raid Today: అనన్య పాండే, షారుక్ నివాసాలపై దాడులు.. విచారణకు హాజరు కావాలంటూ సమన్లు

బాలీవుడ్ ప్రముఖుల నివాసాలపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పంజా విసిరారు. ఏకంగా సూపర్ స్టార్ షారుక్ ఖాన్, స్టార్ యువ హీరోయిన్ అనన్య పాండే నివాసాలపై ఏకకాలంలో దాడుల చేయడం సంచలనంగా మారింది. ముంబైలోని షారుక్ నివాసం మన్నత్, అలాగే అనన్య పాండే ఇంటిపై దాడులు చేశారు. దీంతో బాలీవుడ్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హిందీ చిత్ర పరిశ్రమలో ఏం జరుగుతుందో అర్దం కాని పరిస్థితుల్లో ఉన్నామనే సందిగ్దంలో సినీ ప్రముఖులు పడిపోయారు. ఈ తాజా పరిణామానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.

ఆర్యన్‌ ఖాన్‌తో యువ హీరోయిన్ లింకు అంటూ

ఆర్యన్‌ ఖాన్‌తో యువ హీరోయిన్ లింకు అంటూ

అర్యన్ ఖాన్ అరెస్ట్ తర్వాత మీడియాలో యువ హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఓ వర్థమాన హీరోయిన్‌తో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్‌కు సంబంధించి వాట్సాప్‌లో ఛాటింగ్ చేశారు. వారికి ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నాయి అంటూ ఆధారాలను ఎన్సీబీ అధికారులు కోర్టుకు సమర్పించారు. దాంతో ఎవరా హీరోయిన్ అనే విషయం చర్చనీయాంశమైంది.

అన్యన పాండేతో ఆర్యన్ ఖాన్‌ ఛాటింగ్?

అన్యన పాండేతో ఆర్యన్ ఖాన్‌ ఛాటింగ్?

అయితే గురువారం ఉదయమే వాహనంలో వచ్చిన అధికారులు అనన్య పాండే ఇంటిపై దాడులు చేయడంతో ఆర్యన్ ఖాన్‌కు లింక్ ఉన్న హీరోయిన్ ఆమె అనేది ప్రాథమికంగా స్పష్టమైంది. అనన్య ఇంటిలో తనిఖీల తర్వాత అక్కడి నుంచి కొందరిని తమతోపాటు తీసుకెళ్లారు. కొన్ని వస్తువులను, బ్యాగులను తీసుకెళ్లడం వీడియో ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపించింది. ఇదంతా కొద్ది గంటల్లోనే చకచకా జరిగిపోయింది.

అనన్య పాండే ఇంటిపై దాడులు

ఇదిలా ఉండగా, అనన్య పాండే ఇంటిలో దాడులు నిర్వహించిన తర్వాత ఆమెకు ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేశారు. గురువారం 2 గంటల ప్రాంతంలో ఎన్సీబీ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపారు. దాంతో 2 గంటల ప్రాంతంలో ఆమె హాజరు అయ్యే అవకాశం కనిపిస్తున్నది. దీంతో బాలీవుడ్ సినీ పరిశ్రమ మరోసారి భారీ కుదుపుకు లోనైంది.

షారుక్ నివాసంపై ఎన్సీబీ రైడ్స్

షారుక్ నివాసంపై ఎన్సీబీ రైడ్స్

ఇదిలా ఉండగా, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ఉదయమే తన కుమారుడు ఉన్న ఆర్థర్ రోడ్ జైలుకు వెళ్లారు. తన కొడుకును తొలిసారి పరామర్శించేందుకు వెళ్లగా జైలు ముందర మీడియా, అభిమానులు హడావిడి సృష్టించారు. షారుక్ ఖాన్‌పైకి ఒక్కసారిగా మీడియా దూసుకెళ్లింది. మీడియాను, కెమెరామెన్లను కట్టడి చేయడంతో షారుక్ జైలులోకి వెళ్లారు.

సోదాలు కొనసాగుతున్నట్టు వార్తలు..

సోదాలు కొనసాగుతున్నట్టు వార్తలు..

అయితే షారుక్ ఖాన్ ఆర్థర్ రోడ్ జైలుకు వెళ్లారనే వార్త వస్తుండగానే, ఆయన ఇంటిపై ఎన్సీబీ అధికారులు దాడులు చేశారనే వార్త సంచలనం రేపింది. తాజా సమాచారం ప్రకారం.. షారుక్ ఇంటిపై ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ వార్త అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎన్సీబీ అధికారులు దాడులు కలవరం రేపుతున్నాయి.

Recommended Video

Shahrukh Khan కి టఫ్ టైమ్.. ఉచ్చులో Ananya Pandey | King Khan ఆవేదన || Filmibeat Telugu
అనన్య పాండే ఫోన్లు, ల్యాప్ టాప్స్ స్వాధీనం

అనన్య పాండే ఫోన్లు, ల్యాప్ టాప్స్ స్వాధీనం

అనన్య పాండే నివాసంలో ఎన్సీబీ అధికారులు జరిపిన సోదాలు పలు ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకొన్నట్టు తెలిసింది. అనన్య పాండే నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్స్ స్వాధీనం చేసుకొన్నారు. ఆర్యన్ ఖాన్ మొబైల్ ఫోన్‌ నుంచి డ్రగ్స్‌ కొనుగోళ్లకు సంబంధించిన మెసేజ్‌లు వెళ్లాయనే నేపథ్యంలో ఆమె ఫోన్లను స్వాధీనం చేసుకొన్నట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X