ఎన్సీబీ అదుపులో భారతీ సింగ్ దంపతులు.. డ్రగ్స్ కేసులో బాలీవుడ్ కమెడియన్ ఇంటిపై దాడులు
బాలీవుడ్‌లో మరోసారి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శనివారం మెరుపు దాడులు చేశారు. డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారించగా వెల్లడైన సమాచారంతో కమెడియన్ భారతీ సింగ్ ఇంటిపై దాడులు నిర్వహించారు. బాలీవుడ్‌లో డ్రగ్స్ మాఫియాతో లింకులపై దర్యాప్తు చేస్తున్న అధికారులు భారతీ సింగ్ ఇంటిపై దాడులు చేసి సమన్లు జారీ చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇలా ఉన్నాయి..

ఎన్సీబీ విచారణకు భారతీ సింగ్ దంపతులు
ఎన్సీబీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో భారతీ సింగ్ ఎన్సీబీ కార్యాలయానికి హాజరయ్యారు. దాడి తర్వాత భారతీ సింగ్ భర్త హార్ష్ లిండిచియాను తమ వ్యానులో తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత భారతీ సింగ్ తన మెర్సిడెజ్ బెంజ్ కారులో విచారణకు హాజర్యారు. ప్రస్తుతం వారిని ఎన్సీబీ అధికారులు విచారిస్తున్నారు.

భారతీ సింగ్ ఇంటిలో డ్రగ్స్ లభించడంతో
డ్రగ్స్ కేసులో విచారణ నిమిత్తం సమన్లు జారీ చేశారు. వారి విచారణకు హాజరవుతున్నాం అని భారతీ సింగ్ తెలిపారు. ఇదిలా ఉండగా, భారతీ సింగ్ దంపతులను అదుపులోకి తీసుకొన్నాం. వారి వద్ద నిషేధిత మాదక ద్రవ్యాలు లభించడంతో వారిని విచారణకు పిలిచాం అని ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖెడే తెలిపారు.

బాలీవుడ్ నిర్మాత భార్య అరెస్ట్
ఇటీవల ముంబైలో ఓ డ్రగ్స్ సరఫరాదారుడిని విచారించగా భారతీ సింగ్ దంపతుల పేర్లు బయటకు రావడంతో వారి నివాసంపై దాడి చేసినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా, ఇటీవల బాలీవుడ్ నిర్మాత ఫిరోజ్ నడియాడ్‌వాలా భార్య షబానా సయాత్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 67 ప్రకారం కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Recommended Video

డ్రగ్స్ మాఫియాతో బాలీవుడ్ సంబంధాలు
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత డ్రగ్స్ మాఫియాతో బాలీవుడ్ ప్రముఖుల సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని అరెస్ట్ చేయడం, నెల రోజులపాటు రిమాండ్ అనంతరం ఆమె బెయిల్‌పై రిలీజ్ అయింది. రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి ఇంకా జైలులోనే ఉన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











