డ్రగ్స్ కేసులో సంచలనం.. స్టార్ హీరో, ప్రముఖ దర్శక, నిర్మాతలకు లింకు.. వచ్చేవారం సమన్లు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో భాగంగా దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు బాలీవుడ్ తారలకు డ్రగ్స్ రాకెట్ సంబంధాలు సంచలన రీతిలో బయటపెడుతున్నారు. సినీ పరిశ్రమలో ఎన్నడూ లేని విధంగా నలుగురు స్టార్ హీరోయిన్లకు డ్రగ్స్ వినియోగ ఆరోపణల విషయంలో సమన్లు జారీ చేయడం సెన్సేషనల్‌గా మారింది. కేవలం హీరోయిన్ల పేర్లే బయటకు రావడంపై సర్వత్ర చర్చనీయాంశమైంది. అయితే త్వరలోనే హీరోలు, నిర్మాతలు, దర్శకులకు సమన్లు జారీ చేసే అవకాశం ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

హీరోయిన్లే బలి పశువులా?

హీరోయిన్లే బలి పశువులా?

బాలీవుడ్‌తోపాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ రాకెట్‌తో సినీ తారల సంబంధాలు కలకలం రేపాయి. బాలీవుడ్‌లో రియా చక్రవర్తి అరెస్ట్ కాగా, కన్నడ సినీ పరిశ్రమలో రాగిణి ద్వివేది, సంజన గల్రానీ ఇప్పటికే కస్టడీలో ఉన్నారు. అయితే డ్రగ్స్ కేసు దర్యాప్తులో హీరోల పేర్లు బయటకు రాకపోవడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్లే డ్రగ్స్ వాడుతారా? హీరోలు వాడరా? హీరోయిన్లనే బలి పశువులుగా చేస్తారా? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

వాట్సప్ ఛాటింగ్ ఆధారంగా

వాట్సప్ ఛాటింగ్ ఆధారంగా

అయితే రియా చక్రవర్తిని విచారించిన సమయంలో బయటపడిన వాట్సాప్ ఛాట్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం. ఆమెతో సన్నిహితంగా ఉంటూ డ్రగ్స్ వ్యవహారాలతో సంబంధాలు ఉన్న విషయాలు మా దృష్టికి వచ్చాయి. తొలుత వారి సమాచారం క్షుణ్ణంగా పరిశీలించి వారికి సమన్లు జారీ చేశాం అని ఎన్సీబీ అధికారులు వెల్లడించినట్టు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

పలువురు హీరోలు, దర్శక, నిర్మాతలకు

పలువురు హీరోలు, దర్శక, నిర్మాతలకు

తాజా జాతీయ మీడియా కథనాల ప్రకారం.. సారా ఆలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్దాకపూర్, దీపిక పదుకోన్ విచారణ తర్వాత పలువురు హీరోలకు, నిర్మాతలకు, దర్శకులకు సమన్లు జారీ చేస్తాం. ఆ ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. డ్రగ్స్ సప్లయర్లు వెల్లడించిన సమాచారం ప్రకారం సమన్లు జారీ చేసే అంశంపై దృష్టిపెట్టాం అని కథనాల్లో పేర్కొంటున్నారు.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
స్టార్ హీరో, నిర్మాత, ప్రొడ్యూసర్‌కు

స్టార్ హీరో, నిర్మాత, ప్రొడ్యూసర్‌కు

ఇక ఎన్సీబీ వర్గాలు వెల్లడించినట్టు ప్రచురించిన కథనాల్లో.. వచ్చేవారం ఓ స్టార్ హీరోకు, స్టార్ ప్రొడ్యూసర్, ప్రముఖ దర్శకుడికి సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. కొన్ని విషయాలను నివృత్తి చేసుకొన్న తర్వాత వారికి సమన్లు జారీ చేస్తాం. డ్రగ్స్ రాకెట్‌తో సంబంధాలు ఉన్న మరికొందరి పేర్లు బయటపెడుతాం అని ఎన్సీబీ వర్గాలు వెల్లడించినట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X