For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కరణ్ పార్టీపై ఎన్సీబీ నిఘా.. దీపికకు బిగుస్తున్న ఉచ్చు.. దేశం విడిచి పారిపోయేందుకు సినీ ప్రముఖులు?

  |

  బాలీవుడ్‌తో లింకులున్న డ్రగ్స్ కేసులో దీపిక పదుకోన్‌, కరణ్ జోహర్‌ మెడకు ఉచ్చు బిగుసుకొంటున్నది. 2019లో కరణ్ జోహర్ నివాసంలో జరిగిన పార్టీపై ఇప్పుడు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు దృష్టిపెట్టారు. ఆ పార్టీలో బాలీవుడ్ ప్రముఖులతో కూడిన వీడియో సోషల్ మీడియాలో అప్పట్లో హల్‌చల్ చేసింది. తాజాగా ఆ వీడియోపై మాజీ ఎమ్మెల్యే సిర్సా ఫిర్యాదు చేయడంతో పార్టీలో డ్రగ్స్ వాడారా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

  కరణ్ జోహర్ పార్టీపై లోతుగా దర్యాప్తు

  కరణ్ జోహర్ పార్టీపై లోతుగా దర్యాప్తు

  2019లో జరిగిన పార్టీలో దీపిక పదుకోన్, వికీ కౌశల్, రణ్‌బీర్ కపూర్, వరుణ్ ధావన్, జోయా అఖ్తర్, షాహిద్ కపూర్, మలైకా అరోరా, అర్జున్ కపూర్‌తోపాటు పలువురు సెలబ్రిటీలు ఉన్నారు. ఆ పార్టీలో ఉన్న వారికి ఎన్సీబీ సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. ఈ పార్టీలో వికీ కౌశల్ పక్కనే డ్రగ్స్ ఉన్నాయనే విషయం వీడియోలో స్పష్టంగా కనిపించింది.

  దీపిక, కరిష్మా వాట్సాప్ చాటింగ్

  దీపిక, కరిష్మా వాట్సాప్ చాటింగ్

  కాగా, 2017 సంవత్సరంలో అక్టోబర్ 28వ తేదీన టాలెంట్ మేనేజర్ జయా సాహాతో జరిగిన చాటింగ్లో నీ దగ్గర మాల్ (సరుకు) ఉందా? అంటూ మేనేజర్ కరిష్మాఅడిగింది. అయితే రాత్రి 11.30 గంటల నుంచి 12 గంటల మధ్య కోకో రెస్టారెంట్‌కు వస్తాను. నాకు వీడ్ వద్దు.. హాష్ కావాలి అంటూ దీపిక వాట్సప్‌లో మెసేజ్ చేయడం ఎన్సీబీ అధికారులు దృష్టికి వచ్చింది. అక్టోబర్ 28వ తేదీ రాత్రి దీపికా పదుకోన్ తన స్నేహితులతో కలిసి కోకో రెస్టారెంట్‌లో తెల్లవారే వరకు పార్టీ జరుపుకొన్నారు. ఈ పార్టీ గురించి ప్రధానంగా విచారించే అవకాశం ఉంది.

  ధర్మ ప్రొడక్షన్ సిబ్బందిపై నిఘా

  ధర్మ ప్రొడక్షన్ సిబ్బందిపై నిఘా

  అయితే ధర్మ ప్రొడక్షన్ సిబ్బందిలో ఇద్దరిని డ్రగ్స్ ఆరోపణలపై సమన్లు జారీచేయడం సంచలనం రేపుతున్నది. ధర్మ ప్రొడక్షన్‌కు చెందిన క్షిటిజ్‌ ప్రసాద్‌ ఇంట్లో రైడ్ చేయడంతోపాటు అతడిని అదుపులోకి తీసుకొని సుదీర్ఘంగా ప్రశ్నించారు. ధర్మలో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ అనుభవ్‌ చోప్రాను కూడా విచారించారు. ఈ క్రమంలో కరణ్ జోహర్ స్పందించారు.

  కరణ్ జోహర్ వివరణ

  కరణ్ జోహర్ వివరణ

  డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుభవ్ చోప్రా మా ఉద్యోగి కాదు. గతంలో కొద్ది నెలలు మాతో కలిసి పనిచేశాడు. నాకు డ్రగ్స్ వాడే అలవాటు లేదు. ఎలాంటి మాదక ద్రవ్యాలను వినియోగించలేదు. నార్కోటిక్స్‌ను ప్రమోట్ కూడా చేయలేదు. నాపై, నా ఫ్యామిలీపై వస్తున్న కథనాల్లో వాస్తవం లేదు. దురుద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా వస్తున్నాయి అని కరణ్ జోహర్ తన ప్రకటనలో తెలిపారు.

  భయాందోళనలలో బాలీవుడ్ ప్రముఖులు..

  భయాందోళనలలో బాలీవుడ్ ప్రముఖులు..

  అయితే కరణ్ జోహర్ పార్టీతోపాటు డ్రగ్స్ రాకెట్‌లో అనుమానాలు వ్యక్తమవుతున్న బాలీవుడ్ నటులు దేశం విడిచిపోవాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. సమన్లు, ఎన్సీబీ దాడులతో బెంబేలెత్తిన సినీ ప్రముఖులు మహారాష్ట్రకు చెందిన టాప్ ఉన్నతాధికారులను సంప్రదిస్తూ ఎలా బయటపడాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. వీలైతే రక్షణ కల్పించాలని, ఈ కేసులో ఆరోపణలోస్తే బయటపడే విధంగా సహాయం చేయాలని వేడుకొంటున్నట్టు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

  Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
  ఎన్సీబీ విచారణకు దీపిక పదుకోన్

  ఎన్సీబీ విచారణకు దీపిక పదుకోన్

  ఇదిలా, ఉండగా డ్రగ్స్ కేసులో సమన్లు అందుకొన్న దీపికా పదుకోన్ శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో విచారణకు హాజరుకానున్నారు. దక్షిణ ముంబైలోని నార్కోటిక్స్ గెస్ట్ హౌస్ కార్యాలయంలో జరిగే విచారణ కోసం దీపిక ఎన్సీబీ అధికారుల ముందుకు రానున్నారు. ఈ క్రమంలో దక్షిణ ముంబై, ఎన్సీబీ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసుల భద్రతను ఏర్పాటు చేశారు.

  English summary
  Deepika to attend NCB probe on September 26th in drug case, Earlier, NCB to Issue summons to Shraddha Kapoor, Sara Ali Khan in Rhea Chakraborty Drug case. Rhea Chakraborty was arrested on September 8, 2020, by NCB in drug links allegations. Recently, Sara Ali Khan and Shraddha Kapoor names come into light of the media. Apart from This, Two top heroine of bollywood name surfaced in the drug case. Sidharth Malhotra, Sonakshi Sinha, Aditya Roy Kapur attended Deepika Padukone's party in Koko restaurant.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X