బ్రేకింగ్: శ్రద్దా కపూర్, సారా ఆలీ ఖాన్‌కు సమన్లు? డ్రగ్ కేసులో ఎన్సీబీ దూకుడు
బాలీవుడ్ డ్రగ్ రాకెట్‌లో అగ్ర సినీ తారలకు మెడకు ఈ కేసు ఉచ్చు బిగుసుకొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో బాలీవుడ్ తార రియా చక్రవర్తి అరెస్టై కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో శ్రద్ధాకపూర్, సారా ఆలీ ఖాన్‌కు త్వరలోనే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సమన్లు జారీ చేసే అవకాశం ఉందనే వార్త బాలీవుడ్‌లో సంచలనం రేపుతున్నది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

సుశాంత్ ఫామ్‌హౌజ్‌లో పార్టీల్లో శ్రద్దా కపూర్
బాలీవుడ్‌తో డ్రగ్ రాకెట్ దందాపై నార్కోటిక్ బ్యూరో అధికారులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు. సుశాంత్ మేనేజర్‌ను విచారించగా, ముంబైకి సమీపంలోని పావ్నా గెస్ట్ హౌజ్‌లో జరిగిన పార్టీలకు శ్రద్దాకపూర్ హాజరయ్యారు. వారు అక్కడ మద్యం, మాదక ద్రవ్యాలు తీసుకొన్నారు అనే విషయాన్ని వెల్లడించారు. దాంతో పాటు విచారణలో రియా కూడా సారా ఆలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, డిజైనర్ సైమొన్ ఖంబట్టా పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ఎన్సీబీ విచారణలో శ్రద్దాకపూర్ పేరు కూడా తెరపైకి రావడం బాలీవుడ్‌లో కలకలం రేపింది.

రియా చక్రవర్తి నోట బాలీవుడ్ ప్రముఖుల పేర్లు
కస్టడీలో ఉన్న రియా చక్రవర్తిని దాదాపు 55 ప్రశ్నలకు పైగా సంధించినట్టు తెలుస్తున్నది. విచారణలో, వాట్సాప్ ఛాటింగ్ ద్వారా వెలుగు చేసిన అంశాలను ఆధారంగా చేసుకొని సారా ఆలీ ఖాన్, శ్రద్ధాకపూర్‌తోపాటు డిజైనర్ సైమోన్ ఖంబట్టాకు కొద్ది రోజుల్లో సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఎన్సీబీ అధికారులు చెప్పారు అని డీఎన్ఏ తన కథనంలో పేర్కొన్నది.

తన ప్రతిష్టకు భంగం.. రకుల్ పిటిషన్
డ్రగ్స్ కేసుకు సంబంధించిన తన పేరును మీడియాలో తప్పుగా ఉయోగిస్తున్నారని ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాంతో ఢిల్లీ హైకోర్టు స్పందిస్తూ.. ప్రసార భారతి, కేబుల్ టీవీ చట్టాలకు అనుగుణంగా వార్తలు ప్రసారం లేదా ప్రచురించాలని, ఒకవేళ అధికారికంగా రకుల్ పేరు బయటకు వస్తే తప్ప ఆమె గురించి రాయడానికి వీలు లేదని స్పష్టం చేసింది.

త్వరలోనే అధికారికంగా సెలబ్రిటీల పేర్లు
ఢిల్లీ హైకోర్టు ఆదేశాల కారణంగా రకుల్ ప్రీత్ పేరును బయటకు వెల్లడించడానికి ఎన్సీబీ నిరాకరించినట్టు తెలుస్తున్నది. త్వరలోనే రియా విచారణ పూర్తయిన తర్వాత బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు ప్రకటించి వారికి సమన్లు జారీ చేస్తామని అంతర్గతంగా అధికారులు వెల్లడించినట్టు తెలుస్తున్నది. ఈ కేసులో ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 67 ప్రకారం సమన్లు జారీ చేస్తామని చెప్పినట్టు బాలీవుడ్ మీడియా కథనాలను వెల్లడించింది


Click it and Unblock the Notifications











