నాపై బోల్డ్, వ్యాంప్ ముద్ర వేశారు.. అలాంటి పాత్రలే ఆఫర్.. బాలీవుడ్ హీరోపై నీనా గుప్తా సంచలన వ్యాఖ్యలు
ఇండియన్ సినిమాలో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్లలో నీనా గుప్తా అంటే ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఆమె వ్యవహరశైలి, నటించే పాత్రలు కుండ బద్దలు కొట్టినట్టుగా ఉంటాయి. ఆమె ఎలాంటి ట్రెండ్, ఇమేజ్‌కు లొంగకుండా.. తనకు నచ్చిన పాత్రలు చేస్తూ విశేషంగా ప్రశంసలు పొందారు. అయితే తన వ్యక్తిగత జీవితానికి, ప్రొఫెషనల్ లైఫ్‌కు అసలు పోలిక ఉండదని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. గత మూడు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఎదురైన అనుభవాలను వెల్లడిస్తూ..

నేను వేసుకొనే దుస్తులను బట్టి
నా కెరీర్ గురించి ఆలోచిస్తే.. నా వరకు చాలా సంతృప్తికరంగా ఉంది. నాకు ఎలాంటి కంప్లయింట్ లేవు. కానీ మీడియా, సినీ వర్గాల తీరు నాకు నచ్చదు. నేను వేసుకొనే దుస్తులను బట్టి నా క్యారెక్టర్‌ను డిసైడ్ చేయడం బాధాకరం. నా కెరీర్ ఆరంభంలో నేను ధరించే దుస్తులను చూసి.. నాకు బోల్డ్ క్యారెక్టర్లు, వ్యాంప్ క్యారెక్టర్లు ఆఫర్ చేసే వారు అని నీనా గుప్తా అన్నారు.

దర్శకులకు అలాంటి కన్‌ఫ్యూజన్
అయితే నేను సంప్రదాయ దుస్తులతోపాటు వెస్ట్రన్ అవుట్‌ఫిట్స్ వేసుకోవడంతో నా కెరీర్ ఆరంభంలో నాపై సినీ నిర్మాతలు, దర్శకులకు అనేక సందేహాలు ఉండేవి. నీనా గుప్తా ట్రెడిషినల్ ఇండియన్ ఉమెనా? లేదా గ్లామరస్ యాక్టరా? అనే మీమాంసలో ఉండేవారు. దాంతో నాకు ఎలాంటి పాత్ర ఇవ్వాలో అనే విషయంలో క్లారిటీ లేకుండా ఉండేవాళ్లు. చాలా మంది దర్శకులకు నా విషయంలో కన్‌ఫ్యూజన్ ఉండేది అని నీనా గుప్తా తెలిపారు.

బోల్డ్ ఉమెన్‌గా, వ్యాంప్‌గా
నేను టెలివిజన్ రంగంలో సంప్రదాయంగా అమ్మ, అక్క పాత్రలు చేశాను. కానీ నన్ను మీడియా ఓ బోల్డ్ ఉమెన్‌గా, వ్యాంప్‌గా ముద్ర వేసింది. దాంతో అందరూ నాకు నెగిటివ్ క్యారెక్టర్లు మాత్రమే ఆఫర్ చేసేవారు. నటి అంటే.. ఎలాంటి పాత్రలైనా పోషించాలి. డాక్టర్ పాత్రకు డాక్టర్లను తీసుకోరు కదా.. అని నీనా గుప్తా ప్రశ్నించారు.

మిడిల్ క్లాస్ గృహిణిగా
బాదాయి హో సినిమా సమయంలో నన్ను తీసుకోవడానికి నటుడు ఆయుష్మాన్ ఖురానా నిరాకరించారు. నీనా గుప్తా చాలా హాట్‌గా ఉంటుంది. ఈ సినిమాలోని పాత్రకు ఆమె సరిపోరు అని వాదించాడు. అయితే నేను, జాకీ ష్రాఫ్ నటించిన కుజ్లీ అనే షార్ట్ ఫిలింను నిర్మాతలు చూపించి.. ఆయనను ఒప్పించారు. ఆ సినిమాలో మిడిల్ క్లాస్ గృహిణిగా నటించాను. ఆ సినిమాకు నాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. మనిషిని, వ్యక్తిత్వాన్ని అంచనా వేసి పాత్రలు ఆఫర్ చేయకూడదు అని నీనా గుప్తా చెప్పారు.

సూరజ్ బర్జత్యాస్ మూవీలో
మైనే ప్యార్ కియా సినిమా తర్వాత సూరజ్ బర్జత్యాస్ మూవీలో నటించాలని ఆయన వెంటపడ్డాను. చాలా సార్లు ఆయన ఆఫీస్ చుట్టు తిరిగాను. కానీ చాలా సార్లు కుదర్లేదు. ప్రస్తుతం ఆయన రూపొందించే ఉంచాయి అనే సినిమాలో అమితాబ్‌తో కలిసి నటిస్తున్నాను. ఈ సినిమా నవంబర్ 4వ తేదీన రిలీజ్ అవుతున్నది అని నీనా గుప్తా తెలిపారు


Click it and Unblock the Notifications











