ముద్దులతోనే పిల్లలా? .. 95 శాతం భార్యలది మట్టి బుర్రే.. హీరోయిన్ బోల్డ్ కామెంట్స్

తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా. సినిమాలు, షూటింగ్స్ మాత్రమే కాదు.. 70కి చేరువ అవుతున్నా ఇప్పటికీ హాట్ హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ హల్ చల్ చేస్తారు నీనా. సినిమాలతో పాటు సామాజిక అంశాలపైనా మాట్లాడుతూ దుమారం రేపుతుంటారు నీనా. తాజాగా భారతీయ మహిళలు, వారి శృంగార జీవితంపై బోల్డ్ కామెంట్స్ చేశారు నీనా. ఈ వివరాల్లోకి వెళితే..

బెంగాల్‌కు చెందిన నీనా గుప్తా ఢిల్లీలో పెరిగారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎంఏ, ఎంఫిల్ చేశారు. సంస్కృతపై పీహెచ్‌డీ చేస్తున్నారు. 1977లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరిన నీనా గుప్తా.. ఇబ్రహీం అల్కాజీ, బీవీ కారంత్ వద్ద నటనలో శిక్షణ తీసుకున్నారు. 1982లో సాథ్ సాథ్ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన నీనా గుప్తా దాదాపు 43 ఏళ్లుగా నటిస్తూనే ఉన్నారు. హిందీతో పాటు ఒడియా, మలయాళం భాషలలో నటించారు. వెండితెరతో పాటు బుల్లితెరపైనా పలు సీరియల్స్ , సిరీస్‌లలో నటించడంతో దర్శకత్వం వహించారు.

Neena Gupta bold comments lust stories 2 actress about indian women psychology

తొలుత అమ్లాన్ కుసుమ్ ఘోష్‌తో నీనా గుప్తా పెళ్లి జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాలతో వీరు విడిపోయారు. అనంతరం సారంగ్‌దేవ్ పండిట్‌ ప్రేమాయణం నడిపారు. ఇక వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్‌తో నీనా ప్రేమాయం క్రికెట్, సినీ రంగాలను కుదిపేసింది. ఆయనతో డేటింగ్ చేస్తున్న సమయంలో గర్బం దాల్చిన నీనా గుప్తా.. మసాబా గుప్తాకు జన్మనిచ్చారు. అయితే రిచర్డ్స్‌ను పెళ్లి చేసుకోకుండా ఒంటరి తల్లిగానే ఆమెను పెంచి పెద్దదాన్ని చేశారు. 2008లో 40 ఏళ్ల వయసులో ఢిల్లీకి చెందిన వివేక్ మెహ్రాను అమెరికాలో పెళ్లాడి షాకిచ్చారు నీనా.

ఏ విషయంపై అయినా అస్సలు మొహమాట పడకుండా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటం నీనా గుప్తా శైలి. ఇటీవల కరీనా కపూర్ హోస్ట్‌గా ప్రసారమైన ఒక షోలో మీరు 60 ప్లస్‌లో షార్ట్స్ ఎందుకు వేసుకుంటున్నారని కరీనా ప్రశ్నించింది. దీనికి ఆమె దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది. మీ నాన్న సంపాదించిన డబ్బులతో నేను వేసుకోవడం లేదు కదా అని చెప్పడంతో కరీనా ఖంగుతింది. అలాగే ఉంచాయి మూవీలో నటనకు గాను ఉత్తమ నటిగా జాతీయ చలన చిత్ర పురస్కారాన్ని అందుకుంది. లస్ట్ స్టోరీస్ -2, 1000 బేబీస్ సిరీస్‌లలో నటించి దుమ్మురేపారు నీనా గుప్తా.

ఇటీవల ఫెమినిజం, స్త్రీ పురుష సమానత్వం వంటి బలమైన అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు నీనా గుప్తా. స్త్రీగా, పేద మహిళగా పుట్టడం శారదమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలోని 95 శాతం మహిళలు శృంగారం అనేది ఆనందించడానికి, ఎంజాయ్‌మెంట్ కోసం చేస్తారని కూడా తెలియదని నీనా అన్నారు. భర్తతో గడిపితే పిల్లలను కనొచ్చనే భావన మాత్రమే స్త్రీలకు ఉంటుందని, కేవలం ముద్దు పెట్టుకుంటే పిల్లలు పుడతారనే భావనలో ఉన్నవాళ్లు ఎందరోనని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో అదే చూపించడం వల్ల నేను కూడా అదే భ్రమలో బతికానంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నీనా గుప్తా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: neena gupta lust stories 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X