మాజీ క్రికెటర్ ప్రియురాలు సంచలన నిర్ణయం.. 59 ఏళ్ల వయసులో గర్భవతిగా!

Recommended Video

'My Pregnancy Was A Difficult Time' Says Neena Gupta

బాలీవుడ్ సంచలన నటి నీనా గుప్తా గురించి తెలియని వారుండరు. సహజీవనం అంటేనే అంతా ఆశ్చర్యపోయే రోజుల్లో ఈ సీనియర్ నటి వెస్టిండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ తో ఘాటు ప్రేమాయణం సాగించింది. నటిగా, బుల్లితెరపై దర్శకురాలిగా రాణిస్తోంది. ప్రస్తుతం నీనా గుప్తా వయసు 59 ఏళ్ళు. వయసు పెరిగే కొద్దీ నటీమణులు విభిన్నమైన పాత్రలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కానీ నీనా గుప్తా తాజాగా నటిస్తున్న బదాయి హో చిత్రంలో పోషిస్తున్న పాత్ర గురించి తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే.

పెళ్లి కాకుండానే

పెళ్లి కాకుండానే

80వ దశకంలోనే నీనా గుప్తా బాలీవుడ్ లో ఓ సంచలనం. వెస్టిండీస్ క్రికెటర్ విప్ రిచర్డ్స్ తో సహజీవనం చేసి పెళ్లి కాకుండానే తల్లిగా మారింది. వీరిద్దరికి మషాబా గుప్త అనే కుమార్తె కూడా జన్మించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత నీనా గుప్తా రిచర్డ్స్ నుంచి విడిపోయి మరో వివాహం చేసుకుంది.

59 ఏళ్ల వయసులో

59 ఏళ్ల వయసులో

నీనా గుప్తా తాజగా నటిస్తున్న చిత్రం బదాయి హో. ఈ చిత్రంలో నీనా గుప్తా పెళ్లి కాకుండానే గర్భవతిగా మారిన మహిళా పాత్రలో నటిస్తోంది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నీనా గుప్తా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ చిత్రం వలన తన పాతజ్ఞాపకాలు గుర్తుకు రావని తెలిపింది.

 అప్పట్లో చాలా కష్టాలు

అప్పట్లో చాలా కష్టాలు

తాను నిజజీవితంలో గర్భవతిగా ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని నీనా గుప్తా తెలిపింది. అలాంటివి ఏమీ ఈ చిత్రంలో ఉండవు. సింగిల్ మదర్ గా చాలా రోజులపాటు నీనా గుప్తా తన కుమార్తెని పెంచిన విషయం తెలిసిందే. బాగా వయసు నిండిన మహిళ గర్భం దాల్చే పాత్రలో నీనా గుప్తా నటిస్తోంది.

పెద్ద విషయం కాదు

పెద్ద విషయం కాదు

లేటు వయసులో ప్రెగ్నెన్సీ అనేది పెద్ద విషయం కాదు. మన పూర్వీకులకు చిన్న వయసులోనే వివాహాలు జరిగేవి. కానీ వాళ్ళు వయసు 40 దాటిన తరువాత కూడా పిల్లల్ని కంటూనే ఉండేవారు అని నీనా గుప్తా తెలిపింది. ఆసక్తికరమైన ఈ చిత్ర కథవలనే సినిమాని అంగీకరించినట్లు నీనా గుప్తా తెలిపింది.

అక్టోబర్ 19న

అక్టోబర్ 19న

బదాయి హో చిత్రం అక్టోబర్ 19న విడుదలకు సిద్ధం అవుతోంది. నీనా గుప్తాతో పాటు ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, సన్య మల్హోత్రా కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నీనా గుప్తా పాత్ర గురించే అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X