Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మా అల్లుడు మంచోడు.. విడాకుల గురించి వినగానే షాక్.. తొందర పడొద్దంటూ కుమార్తెకు సలహా!
బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా ఈ వయసులో కూడా అద్భుతమైన పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు. గత ఏడాది విడుదలైన బదాయి హో చిత్రంలో నినా గుప్తా కీలక పాత్రలో నటించిన మెప్పించారు. ఇదిలా ఉండగా నీనా గుప్తా తన కుటుంబ వ్యవహారాలతో మరో మారో వార్తల్లో నిలిచారు. ప్రముఖ మీడియాతో జరిగిన ఇంటర్వ్యూలో నీనా గుప్తా తన కుమార్తె మసాబా గుప్తా విడాకుల విషయం గురించి స్పందించారు. తమ కుమార్తె, అల్లుడు మధు మంటేనా విడాకులు తీసుకుంటున్నారని తెలిసి షాక్ కి గురైనట్లు నీనా తెలిపింది.
కొన్ని రోజుల క్రితమే
నీనా గుప్తా తన కుమార్తె విడాకుల గురించి మాట్లాడుతూ.. నాక్కూడా ఈ విషయం కొన్ని రోజుల క్రితమే తెలిసింది. మసాబా, మధు మంటేనా విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని తెలిసి షాక్ కి గురయ్యా. ఓ తల్లిగా వారిద్దరూ విడిపోకూడదనే కోరుకుంటున్నా. తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు అని నీనా గుప్త తెలిపింది. తన కుమార్తెకు కూడా ఇదే విషయాన్ని చెబుతానని ఆమె అన్నారు.
మా అల్లుడు మంచోడు
మా అల్లుడు మధు మంటేనా మంచి వ్యక్తి. అతడిని తాము ఎప్పటికీ ప్రేమిస్తాం, గౌరవిస్తాం అని నీనా తెలిపారు. ఫ్యాషన్ డిజైనర్ గా రాణిస్తున్న మసాబా గుప్తా, నిర్మాతగా రాణిస్తున్న మధు మంటేనా 2015లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత ఏడాది నుంచే వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ ఏడాది మార్చిలో విడాకుల కోసం వీరిద్దరూ ఉమ్మడిగా దరఖాస్తు చేసుకున్నారు.
విడిపోవాలని నిర్ణయించుకున్నాం
ఈ మేరకు మధు మంటేనా, మసాబా గుప్తా ఉమ్మడిగా ప్రకటన కూడా జారీ చేశారు. తామిద్దరం విడిపోవాలని నిర్ణయించకున్నామని, ఎంతో ఆలోచించే ఈ అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. తమ వ్యక్తిగత జీవితాలని అందరూ గౌరవిస్తారని ఆశిస్తున్నట్లు ఉమ్మడి లేఖలో పేర్కొన్నారు. మరి తన తల్లి నీనా గుప్తా ఇచ్చిన సలహా మేరకు మసాబా గుప్తా మనసు మార్చుకుంటుందేమో చూడాలి.
వాళ్ళిద్దరి కుమార్తెగా
నీనా గుప్తా వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ ప్రేమలో చాల కాలం పాటు కొనసాగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలసి సహజీవనం చేశారు. వీరికి పుట్టిన కుమర్తె మసాబా గుప్తా. నీనా గుప్తా, రిచర్డ్స్ కుమర్తె మసాబా గుప్త గుర్తింపు తెచ్చుకున్నారు. నీనా గుప్తా, రిచర్డ్స్ సహజీవనం చేశారు తప్ప వివాహం చేసుకోలేదు. క్రికెటర్స్, బాలీవుడ్ తారల మధ్య హాట్ టాపిక్ గా మారిన ప్రేమ వ్యవహారాల్లో నీనా గుప్తా, రిచర్డ్స్ లవ్ స్టోరీ కూడా ఒకటి.