For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ పరిస్థితుల్లో నా తల్లి ఆత్మాహత్యాయత్నం.. నా తొలి పెళ్లి బ్రేకప్ అలా.. నీనా గుప్తా ఆత్మకథలో సంచలనాలు!

  |

  బాలీవుడ్ నటి నీనా గుప్తా ఆత్మకథ హిందీ సినీ పరిశ్రమలోనే కాకుండా దక్షిణాదిలో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నది. సచ్ కహో తో అనే ఆటోబయోగ్రఫిలో నీనా గుప్తా వెల్లడించిన అంశాలు ఇప్పుడు మీడియాలోను, సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. అయితే ఇప్పటికే కొన్ని విషయాలు మీడియాలో వైరల్ కాగా, ఇప్పుడు బయటకు వచ్చిన మరికొన్ని అంశాలు ఏమిటంటే..

  తండ్రి మోసం.. తల్లి సూసైడ్ అటెంప్ట్

  తండ్రి మోసం.. తల్లి సూసైడ్ అటెంప్ట్

  ఒకానొక సందర్భంలో నా తల్లి ఆత్మహత్యకు ప్రయత్నించింది. నా తండ్రి చేసిన మోసంతో మనస్తాపానికి గురైన నా తల్లి ఆత్మహత్యాయత్నం చేశారు. రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత నా తండ్రి బయటకు ఎందుకు వెళ్తారో అర్దం కాలేదు. నా సవతి తల్లి సీమ ఆంటీ వద్దకు వెళ్తారనే విషయాన్ని అర్ధం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. మా నాన్న ఉదయం మా ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ ఎందుకు చేయరు? ఇంటికి వచ్చి బట్టలు మార్చుకొని ఆఫీస్ ఎందుకు వెళ్తారని చాలా రోజులకు అర్ధమైంది అని నీనా గుప్తా వెల్లడించింది.

  మసాబ ప్రసవానికి డబ్బుల్లేక

  మసాబ ప్రసవానికి డబ్బుల్లేక

  క్రికెటర్ రిచర్డ్స్‌తో సహజీవనం వల్ల నేను గర్బం దాల్చాను. ఆ సమయంలో సీ సెక్షన్ పద్దతిలో ప్రసవించేందుకు డబ్బులు అవసరం అయ్యాయి. కానీ ఆ డబ్బులు లేకపోవడం వల్ల చాలా కష్టపడ్డాను. ప్రసవం తేదీ సమీపించింది. చూసుకొంటే నా అకౌంట్‌లో చాలా తక్కువ డబ్బు ఉంది. దాంతో సహజ ప్రసవం కోసం 2000 రూపాయలు. అదే సీ సెక్షన్ ఆపరేషన్‌కు 10 వేలు ఖర్చు. అలాంటి సమయంలో నాకు టాక్స్ రీ ఎంబర్స్‌మెంట్ నా అకౌంట్‌లో పడింది. దాంతో నా అకౌంట్‌లో 12వ వేలు కనిపించాయి. దాంతో సీ సెక్షన్ ద్వారా మసాబాకు జన్మనిచ్చాను అని నీనా గుప్తా తన ఆత్మకథలో తెలిపారు.

  ఐదేళ్లు రిచర్డ్స్ మాట్లాడలేదు

  ఐదేళ్లు రిచర్డ్స్ మాట్లాడలేదు

  వెస్టిండీస్ క్రికెటర్, అప్పటి కెప్టెన్ వివియన్ రిచర్డ్స్‌తో సహజీవనం ద్వారా మసాబా పుట్టింది. ఓ సమయంలో మేము ఓ టూర్‌కు పోవాలని అనుకొన్నాం. కానీ అదే సమయంలో మసాబాను స్కూల్‌లో చేర్పించాల్సి వచ్చింది. ఆ కారణంగా ఆయనతో టూర్ రాలేనని చెప్పాను. అయితే తనను కలవడం ఇష్టం లేదనే తప్పుగా అర్ధం చేసుకొన్న రిచర్డ్స్ నాతో ఐదేళ్లు మాట్లాడలేదు. నాపై చాలా రోజులు కోపంతో ఊగిపోయారు అని నీనా గుప్తా చెప్పారు.

   నా తొల్లి పెళ్లి బ్రేకప్ అలా..

  నా తొల్లి పెళ్లి బ్రేకప్ అలా..

  అఫైర్లు, డేటింగ్ వ్యవహారాల మధ్యలో నాకు అమ్లాన్ కుసుమ్ అనే వ్యక్తితో తొలిసారి పెళ్లి జరిగింది. నా జీవితాన్ని ఆయన చూసే విధానం నాకు నచ్చలేదు. నన్ను హౌస్ వైఫ్‌గా మాత్రమే చూడాలని అనుకొన్నారు. కానీ నాకు అది నచ్చలేదు. నేను నా కెరీర్‌ను గొప్పగా ఊహించుకొన్నాను. దాంపత్య జీవితంలో ఉంటే నాకు నేనుగా ఎదుగలేననిపించింది. ఆ విషయంపై భేదాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దాంతో మేమిద్దరం తలోదారి చూసుకొన్నాం అని నీనా గుప్తా వెల్లడించింది. నీనా గుప్తా మొదటి వివాహం తన స్నేహితురాలు బయటపెట్టడంతో మీడియాలో వెలుగు చూసింది.

  Sushant Singh Rajput Biopic Motion Poster Viral సూసైడ్ or మర్డర్?
  బాలీవుడ్‌లో దర్శక, నిర్మాతల వేధింపులు

  బాలీవుడ్‌లో దర్శక, నిర్మాతల వేధింపులు

  తన కెరీర్‌లో దక్షిణాది నిర్మాత వేధింపులు.. అతడు తనతో ఓ రాత్రి గడపమని చెప్పిన విషయాలను తన ఆత్మకథలో వెల్లడించారు. ఇంకా తనను ప్రేమించిన ఓ వ్యక్తి చివరి నిమిషంలో పెళ్లిని క్యాన్సిల్ చేసుకొన్నాడు అనే విషయాలను కూడా తన ఆటోబయోగ్రఫిలో తెలిపారు. అలాగే దర్శకుడు సతీష్ కౌశిక్ పెళ్లి ప్రస్తావన, అలాగే సుభాష్ ఘాయ్, డేవిడ్ ధావన్ వేధింపులు విషయాలను కూడా ఆత్మకథలో ప్రస్తావించడం ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చనీయాంశమవుతున్నాయి.

  English summary
  Neena Gupta autobiography Sach Kahun Toh: Meri Aatmakatha: Neena Gupta sensational revelations in her autobiography Sach Kahun Toh, Which released on june 14th via Virtual meeting. This book is released by Bollywood actress Kareena Kapoor. In this book, Casting couch of South Producer, Subhash Ghai, David Dhawan.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X