గర్భవతిని అయ్యాక 'గే'తో పెళ్లి..సౌత్ నిర్మాత లీలలు.. సంచలన విషయాలు బయట పెట్టిన నటి!
ఒకప్పుడు తమ ప్రైవేట్ జీవితంలో జరిగిన అంశాలను బయట పెట్టడానికి నటీమణులు పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు కానీ ఇప్పుడు పరిస్థితులు మారడంతో తమకు గతంలో ఎదురైన అనుభవాలను వాళ్ళు బయట పెడుతున్నారు. తాజాగా తన జీవితంలో జరిగిన అనేక సంఘటనలను నటి నీనా గుప్తా ఆటోబయోగ్రఫీలో పంచుకున్నారు. అందులో కొన్ని అంశాలు మాత్రం సంచలనంగా మారాయి. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

ఆ క్రికెటర్ తో డేటింగ్
ప్రస్తుతం 60 ఏళ్ల పైబడిన వయస్సుతో అమ్మ, అత్త పాత్రలకు పరిమితమైన నీనా గుప్తా వయసులో ఉన్న రోజుల్లో వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ తో డేటింగ్ చేసింది. అయితే వీరిద్దరు డేటింగ్ చేసేనాటికే ఆయనకు పెళ్లయింది. ఈ విషయం తెలిసి కూడా నీనా ఆయనతో చానళ్ల పాటు సహజీవనం చేసింది. దీంతో ఆమె గర్భం కూడా దాల్చింది. అలా 89లో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

గేతో పెళ్లి
అయితే ఆమె గర్భంతో ఉన్న విషయం తెలుసుకుని సమాజంలో పరువు పోతుందేమోనన్న ఉద్దేశంతో తన స్నేహితులు గే అయిన బ్యాంకర్ కి ఇచ్చి పెళ్లి చేయాలని భావించారని ఆమె తన ఆటోబయోగ్రఫీలో పంచుకుంది. సమాజంలో చెడ్డ పేరు రాకుండా సంసారానికి పనికి రాని ఒక బ్యాంకర్ తో పెళ్లి చేస్తే ఆయన తరువాత మీ జోలికి రారని అప్పుడు తానే పుట్టిన బిడ్డను పెంచుకోవచ్చని ఆమెకు సూచించారట.

లేటు వయసులో పెళ్లి
ఇక 89లో నీనాకు జన్మించిన బిడ్డ ఇప్పుడు ప్రముఖ డిజైనర్ మసాబా గుప్తా. ఇక లేటు వయసులో నేనా ఢిల్లీకి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ వివేక్ మెహ్రాను వివాహం చేసుకున్నారు. వీరి వివాహం 2008లో జరిగింది. ఇక తనను ఒక దక్షిణాది నిర్మాత లైంగికంగా వేధించడానికి చూశారని ఆమె ఆరోపించింది. సదరు నిర్మాత ఎవరు అనే విషయాన్ని ఆమె వెల్లడించక పోయినప్పటికీ ఆ రోజుల్లో తాను ఎంతో మంది హీరోయిన్లను సౌత్ ఇండస్ట్రీ లో పరిచయం చేశానని గొప్పలు చెప్పుకున్నాడని చెప్పుకొచ్చింది.
Recommended Video

సౌత్ నిర్మాతతో
అయితే అసలు పాత్ర వివరాలు చెప్పమంటే అది ఒక చిన్న పాత్ర అని తెలిసింది అని ఆమె చెప్పుకొచ్చారు. తాను వెళ్ళిపోతున్నాను అని చెబితే ఈరోజు రాత్రికి నాతో ఉండవా అని అడిగాడని ఆ మాట వినగానే ఒక బకెట్ ఐస్ వాటర్ తల మీద కుమ్మరించినట్టు అనిపించి రక్తం గడ్డకట్టు పోయిందని ఆ వెంటనే తాను అక్కడి నుంచి పరుగు లంకించుకుని బయటకు వచ్చానని ఆమె వెల్లడించారు..


Click it and Unblock the Notifications











