twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నటుడితో ప్రముఖ సింగర్ వివాహం... లవర్స్ డే ముహూర్తం?

    |

    బాలీవుడ్ సింగర్ నీతి మోహన్ పెళ్లికి సిద్ధమైంది. 'మణికర్ణిక' నటుడు నిహార్ పాండ్యాతో ఆమె వివాహం జరుగనుంది. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం వీరు కపిల్ శర్మ షోకు హాజరయ్యారని, ఈ సందర్భంగా తమ ప్రేమ ఎలా మొదలైందనే విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం.

    లవర్స్ డే సందర్భంగా నీతి మోహన్, నిహార్ పాండ్యా పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కపిల్ శర్మ షోలో వీరు తమ లవ్ స్టోరీ గురించి కూడా వెల్లడించినట్లు సమాచారం. బాలీవుడ్ సర్కిల్‌లో ఈ జంట పెళ్లి విషయం హాట్ టాపిక్ అయింది.

    ప్రేమ అలా మొదలైంది

    ప్రేమ అలా మొదలైంది

    నీతి మోహన్ బ్యాండ్‌లో మెంబర్‌గా ఉన్న ఒక వ్యక్తితో తనకు స్నేహం ఉందని, నీతిని తనకు పరిచయం చేయాలని అతడిని కోరానని, అయితే ఆ ప్రయత్నం ఫలించలేదని నిహార్ పాండ్యా తెలిపారు. అయితే ఇద్దరు అదే ఫ్రెండ్ వెడ్డింగ్ సందర్భంగా గోవాలో సంవత్సరం క్రితం కలిశారట. అక్కడి నుంచి వీరి లవ్ స్టోరీ మొదలైందట. నీతిని ఒక చెట్టుకిందకు తీసుకెళ్లి ఆమెపై పూల వర్షం కురిపిస్తూ ప్రపోజ్ చేసినట్లు నిహార్ ఈ షోలో వెల్లడించినట్లు తెలుస్తోంది.

    తన ప్రేమను అలా చాటుకుంది

    ఇటీవల ‘మణికర్ణిక' సినిమా విడుదల సందర్భంగా నీతి మోహన్... నిహార్ ఫోటోస్ షేర్ చేస్తూ అతడిపై తన ప్రేమను చాటుకున్నారు. సినిమాలో నిహార్ పాత్రకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తూ మురిసిపోయారు.

    నిహార్ పాండ్యా

    నిహార్ పాండ్యా

    ‘మణికర్ణిక' చిత్రంలో నిహార్ పాండ్యా... ప్రాణ్ సుఖ్ యాదవ్ అనే పాత్రలో నటించారు. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి విజయం సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఈ మూవీ రూ. 60 కోట్లు వసూలు చేసింది.

    నీతి మోహన్

    నీతి మోహన్ ఇటీవలే తన న్యూ సింగిల్ ‘కిత్తె రే గయా' టీజర్ విడుదల చేశారు. కాగా.. కొంతకాలం క్రితం నిహార్, దీపిక పదుకోన్ మధ్య లవ్ ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇపుడు ఆమె రణవీర్ సింగ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే.

    English summary
    Singer Neeti Mohan is all set to tie the knot with Bollywood actor Nihar Pandya. According to a report in Mumbai Mirror, the two were guests on The Kapil Sharma Show where they broke the news of their wedding scheduled to take place on Valentine’s Day.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X