నటుడిని పెళ్లాడిన సింగర్ నీతి మోహన్: రిసెప్షన్ రద్దు, కారణం..
బాలీవుడ్ సింగర్ నీతి మోహన్, 'మణికర్ణిక' నటుడు నిహార్ పాండ్యా వివాహం ఫిబ్రవరి 15 హైదరాబాద్‌లో జరిగింది. ఇక్కడి ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో పూర్తి ప్రైవేట్ సెర్మనీగా జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోస్ ఆమె అభిమానులతో పంచుకున్నారు. ముంబైలో వెడ్డింగ్ రిసెప్షన్ జరుగాల్సి ఉండగా... నీతి మోహన్ తండ్రి అనారోగ్యం కారణంగా వాయిదా వేశారట.
'ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ సమక్షంలో మా వివాహం జరిగింది. నాన్న అనారోగ్యం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు' అని నీతి మోహన్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఐ కొత్త దంపతులను విష్ చేస్తూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

నీతి మోహన్-నిహార్ పాండ్యా
నీతి మోహన్-నిహార్ పాండ్యా కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. తమ పెళ్లి జరుగడానికి కొన్ని రోజుల ముందు ప్రసారమైన కపిల్ శర్మ కామెడీ షోకు హాజరైన వీరు తమ లవ్, వెడ్డింగ్ గురించి అభిమానులకు తెలియజేశారు.

ఇద్దరి మధ్య పరిచయం అలా...
తమ లవ్ స్టోరీ గురించి నిహార్ పాండ్యా వెల్లడిస్తూ... ఫ్రెండ్ వెడ్డింగ్ సందర్భంగా గోవాలో సంవత్సరం క్రితం ఇద్దరూ కలిశాం. అక్కడి నుంచి మా ప్రేమ ప్రయాణం మొదలైంది. నీతిని ఒక చెట్టుకిందకు తీసుకెళ్లి ఆమెపై పూల వర్షం కురిపిస్తూ ప్రపోజ్ చేశాను' అని నిహార్ తెలిపారు.

నిహార్
ఇటీవల విడుదలైన ‘మణికర్ణిక' చిత్రంలో నిహార్ పాండ్యా... ప్రాణ్ సుఖ్ యాదవ్ అనే పాత్రలో నటించారు. నిహార్ పాండ్యా గతంలో దీపిక పదుకోన్‌తో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

నీతి మోహన్
బాలీవుడ్ పాపులర్ సింగర్లలో ఒకరైన నీతి మోహన్ ఎన్నో అవార్డు అందుకున్నారు. ఇటీవలే ఆమె తన న్యూ సింగిల్ ‘కిత్తె రే గయా' రిలీజ్ చేశారు.


Click it and Unblock the Notifications











