ఆడ పిల్లకు జన్మనిచ్చిన హీరోయిన్, పెళ్లికి ముందే..
బాలీవుడ్ నటి నేహా ధూపియా గురించి కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు అంగద్ బేడీని ప్రేమ వివాహం చేసుకున్న నేహా... పెళ్లికి ముందే అతడి వల్ల గర్భం దాల్చడమే ఇందుకు కారణం.
తాజాగా అందుతున్న సమాచారం నేహా ధూపియా ఆదివారం బిడ్డను ప్రసవించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నేహా స్నేహితురాలు సోఫీ చౌదరి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆడ పిల్లను ప్రసవించినట్లు ఆమె వెల్లడించారు.
బేబీ గర్ల్
ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నేహా ధూపియా ఆడపిల్లను ప్రసవించింది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు... అంటూ సోఫీ చౌదరి ట్విట్టర్ ద్వారా తెలిపారు.

మే 10న నేహా-అంగద్ వివాహం
నేహా ధూపియా, అంగద్ బేడీ వివాహం మే 10న జరిగింది. పెళ్లికి ముందే నేహా గర్భం దాల్చడంతో... ఈ విషయం బయటకు పొక్కకుండా రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఇలాంటి విషయాలు ఎంత దాచినా దాగవు.... పెళ్లయిన వెంటనే అసలు లీక్ అయింది.

ఆగస్టులో అఫీషియల్‌గా
నేహా ధూపియా, అంగద్ బేడీ దంపతులు తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఆగస్టులో అఫీషియల్‌గా వెల్లడించారు. గతంలో నేహా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా అవకాశాలు రావనే ఉద్దేశ్యంతోనే ఈ విషయాన్ని ఇంతకాలం రహస్యంగా ఉంచినట్లు తెలిపారు.

విషయం ఒప్పుకున్న అంగద్ బేడీ
పెళ్లికి ముందే తన భార్య గర్భం దాల్చిన విషయాన్ని అంగద్ బేడీ సైతం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ విషయం ఇంట్లో వారికి చెప్పగానే చివాట్లు పెట్టారని, వారు తమ నుంచి పెళ్లికి ముందే అలాంటి న్యూస్ ఊహించలేదని తెలిపారు.


Click it and Unblock the Notifications











