ఇదీ అక్కడ హీరోయిన్ల పరిస్థితి! షాకింగ్‌ ఘటన బయటపెట్టిన యంగ్ హీరోయిన్

రంగుల ప్రపంచంలో నటీనటుల విలాసవంతమైన జీవితం, ఖరీదైన కార్లు మాత్రమే బయటకు కనిపిస్తున్నాయి. కానీ సినిమాలు రూపొందించడం, రిహాల్సస్, సెట్స్‌పై కష్టాలు ఎన్నో విషయాల్లో నటీనటులు ఇబ్బంది పడుతుంటారు. ఇక హీరోయిన్ల పరిస్థితి అయితే మరీ ఘోరం అని ఇప్పటికే చాలా మంది చెప్పారు కూడా. ఈ బాటలోనే తాజాగా బాలీవుడ్ భామ నేహా ధూపియా దక్షిణాది సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాల్యాలు చేసింది. ఆ వివరాలు చూద్దామా..

 నేహా ధూపియా.. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో

నేహా ధూపియా.. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో

నటి నేహా ధూపియా బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ నటించింది. తరుణ్‌, శ్రీదేవి, అనిత ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘నిన్నే ఇష్టపడ్డాను' సినిమాలో నేహా అతిథి పాత్రలో కనిపించింది. రాజశేఖర్ ‘విలన్‌', బాలకృష్ణ ‘పరమ వీరచక్ర' సినిమాల్లో హీరోయిన్‌గా కూడా చేసింది. ప్రస్తుతం ఓ షోకు యాంకరింగ్ చేస్తున్న ఈమె.. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన ఓ సంఘటన గురించి తెలిపింది.

హీరోతో పోల్చితే హీరోయిన్‌ను..

హీరోతో పోల్చితే హీరోయిన్‌ను..

సౌత్ సినిమాల గురించి ఆమె మాట్లాడుతూ.. దక్షిణాదిలో హీరోతో పోల్చితే హీరోయిన్‌ను తక్కువ చేసి చూస్తారని చెప్పింది. దక్షిణాది నిర్మాతలు ముందు హీరోకే భోజనం ఏర్పాటు చేసేవారని, అప్పట్లో తాను దక్షిణాది సినిమా చేస్తున్నప్పుడు.. ఓ సారి సినిమా షూటింగ్‌లో తనకు ఊహించని ఘటన ఎదురైందని చెప్పుకొచ్చింది.

ఎవరూ పట్టించుకోలేదు.. పైగా

ఎవరూ పట్టించుకోలేదు.. పైగా

ఓ సినిమా షూటింగ్‌లో తాను చాలా ఆకలితో ఉండగా ఎవరూ పట్టించుకోలేదని, ఆ సమయంలో హీరో షాట్‌లో ఉన్నాడని, ఆయనే ముందు తినాలని నిర్మాతలు చెప్పారని ఆమె తెలిపింది. ఆ ఘటన తనకు బాధించనప్పటికీ.. నవ్వు తెప్పించిందని నేహా తెలిపింది. ఇలాంటివి ఎప్పుడూ ఎక్కడా జరగకూడదని ఆమె పేర్కొంది.

2004లో జూలీ.. ఆ తర్వాత పెళ్లి

2004లో జూలీ.. ఆ తర్వాత పెళ్లి

2004 సంవత్సరంలో వచ్చిన జూలీ సినిమాతో ఫేమస్ అయింది నేహా ధూపియా. ఆ సినిమాలో అందాలు ఆరబోసి కుర్రకారుకి నిద్ర లేకుండా చేసిన ఆమె యావత్ సినీ ప్రపంచాన్ని ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకుంది. ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గడంతో అంగడ్ బేడిని పెళ్లి చేసుకుంది నేహా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X