షాక్: రహస్యంగా హీరోయిన్ నేహా ధూపియా వివాహం (ఫోటోస్)
బాలీవుడ్లో రెండు మూడు రోజులుగా సోనమ్ కపూర్ పెళ్లివేడుకకు సంబంధించిన సందడి సాగుతోంది. సినీ అభిమానులతో పాటు మీడియా ఫోకస్ అంతా ఇటు వైపే ఉంది. ఈ గ్యాపులో రహస్యంగా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది హాట్ బ్యూటీ నేహా ధూపియా. తన బెస్ట్ ఫ్రెండ్, నటుడు అంగద్ బేడీని ఆమె వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం ఇన్‌స్టాగ్రామ్ పేజీలో తమ ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు పోస్టు చేశారు. ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ కూడా వీరి వివాహాన్ని ఖరారు చేస్తూ నూతన దంపతులను విష్ చేశారు. బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం వీరి పెళ్లి విషయం తెలిసి ఆశ్చర్యపోతున్నారు.

ఢిల్లీలో వివాహం
నేహా ధూపియా, అంగద్ బేడీ వివాహం ఢిల్లీలో జరిగింది. పెళ్లి జరుగుతున్న విషయం బయటకు పొక్కకుండా కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ప్రైవేట్ సెర్మనీగా జరిగింది. వివాహ వేడుకలో బాలీవుడ్ ప్రముఖుల ఎవరూ కనిపించలేదు. సినీ ప్రముఖుల కోసం ముంబైలో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

సిక్కు సాంప్రదాయం ప్రకారం
అంగద్ బేడీ, నేహా ధూపియా వివాహం సిక్కు సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ వివాహ వేడుకలో నేహా ధూపియా లైట్ పింక్ కలర్ డ్రెస్సులో మెరిసిపోయింది. అంగద్ వైట్ కలర్ షేర్వానీలో రాయల్ లుక్‌తో దర్శనమిచ్చాడు.

ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్
అంగద్, నేహా ధూపియా ఇద్దరూ సినిమా రంగంలోనే ఉన్నప్పటికీ ఇప్పటి వరకూ వీరు కలిసి ఏ సినిమాలో నటించలేదు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడింది. బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఏర్పడిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నేహా కంటే అంగద్ వయసులో సంవత్సరన్నర చిన్నవాడు.

ఎవరీ అంగద్ బేడీ?
అంగద్ బేడీ మాజీ ఇండియన్ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ కుమారుడు. అంగద్ బేడీ అండర్ 19 వరకు ఢిల్లీ తరుపున క్రికెట్ ఆడారు. ఆ తర్వాత మోడలింగ్, యాక్టింగ్ వైపు ఆసక్తితో ఎంటర్టెన్మెంట్ రంగం వైపు వచ్చారు.

అంగద్, నేహా
సల్మాన్‌తో కలిసి చేసిన టైగర్ జిందాహై మూవీ అంగద్‌కు మంచి పేరు తెచ్చింది. దీంతో పాటు డియర్ జిందగీ, ఫాల్తూ, పింక్ చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ‘సూర్మా' అనే హిందీ చిత్రంలో నటిస్తున్నాడు. ఇక నేహా ధూపియా ప్రస్తుతం బాంబే టాకీస్ 2, ఈల అనే బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











