ఇంటర్నెట్ బ్రేక్ చేస్తున్న తండ్రి, కూతుళ్ల ఫోటో.. రెండు గంటల్లోనే!

Recommended Video

Neha Dhupia's Baby Mehr with Dad Angad Bedi Photo Going Viral | Filmibeat Telugu

బాలీవుడ్ నటుడు అంగద్ బేడీ, హాట్ బ్యూటీ నేహా ధూపియా ఈ ఏడాది ఆరంభంలో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అంగద్ బేడీ కంటే నేహా ధూపియా వయసులో మూడేళ్ళు పెద్ద. అయినా కూడా వీరి మధ్య ఘాటు ప్రేమ కొనసాగడంతో వివాహం బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం రహస్యంగా కేవలం కొందరు కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే జరిగింది. అప్పటి వరకు ఈ జంట సహజీవనం చేసారు. ప్రస్తుతం వీరిద్దరూ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

 పెళ్ళికి ముందే

పెళ్ళికి ముందే

వివాహానికి ముందే నేహా ధూపియా గర్భవతిగా మారింది. ఈ వార్త బయటకు వెళ్ళకూడదు అనే ఉద్దేశంతోనే హడావిడిగా వివాహం చేసుకున్నారు. నేహా ధూపియా ప్రస్తుతం టివి షోలతో బిజీగా గడుపుతోంది, అంగద్ బేడీ నటుడిగా రాణిస్తున్నాడు. ఇటీవల ఈ జంట తల్లిదండ్రులుగా మారారు. నేహా ధూపియా ఓ పాపకు జన్మనిచ్చింది.

వైరల్ అవుతున్న ఫోటో

వైరల్ అవుతున్న ఫోటో

నేహా ధూపియా తాజాగా ఓ ఫోటోని ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు కేవలం రెండు గంటల్లోనే లక్షల్లో లైకులు వస్తుండడం విశేషం. అంగద్ బేడీ గుండెలపై తన బుజ్జి కుమార్తె నిద్రిస్తోంది. ఈ క్యూట్ ఫోటోని క్లిక్ మనిపించింది నేహా ధూపియా అభిమానులతో పంచుకుంది.కేవలం రెండు గంటల్లోనే లక్షా 60 వేలకు పైగా లైకులు వచ్చాయి. అంతలా ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 వ్యక్తిగత విషయాలు

వ్యక్తిగత విషయాలు

నేహా ధూపియా నోఫిల్టర్ నేహా షోకు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఈ షోలు చాలా మంది సెలెబ్రిటీలు పాల్గొంటున్నారు. సరదాగా సాగే ఈ షోలో నేహా సెలెబ్రిటీల వ్యక్తిగత విశేషాలు కూడా బయటకు తీస్తుంది. ఇటీవల అంగద్ బేడీ తన భార్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోకు అతిథిగా హాజరయ్యాడు. అంగద్ గత ప్రేమ వ్యహారాలు గురించి నేహా ధూపియా ప్రస్తావించడంతో అతడు ఆశ్చర్యపోయారు. ఇవ్వని నీకెలా తెలుసు అంటూ ఆశ్చర్యంగా తన సతీమణిని అడిగాడు.

అందుకే ఆ విషయం సీక్రెట్‌గా

అందుకే ఆ విషయం సీక్రెట్‌గా

ఓ ఇంటర్వ్యూలో నేహా ధూపియా మాట్లాడుతూ.. పెళ్లికి ముందే గర్భవతి అయిన విషయాన్ని ప్రస్తావించింది. ఈ విషయాన్ని పెళ్లయ్యేవరకు ఎవరికీ చెప్పకూడదని నిర్ణయించుకున్నాం. ఈ విషయం బయటకు తెలిస్తే మీడియాలో నానా హంగామా చేస్తారు. దానివలన నాకు వచ్చే అవకాశాలు చేజారే ప్రమాదం ఉందని నేహా పేర్కొంది. అందుకే తాను, అంగద్ ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచినట్లు నేహా ఇటీవల పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X