ఆలియా తల్లినీ విడిచిపెట్టని బంధుప్రీతి సెగ.. ఇన్స్టా లో వెనక్కు తగ్గిన సోనీ రాజ్దాన్
బాలీవుడ్ లో రోజు రోజుకీ నెపోటిజం సెగ రాజుకుంటూనే ఉంది. సుశాంత్ మరణంతో అతడి ఫ్యాన్స్, సానుభూతి పరులు ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక సుశాంత్ మరణంతో భట్ ల హస్తం ఉందన్న వార్త చక్కర్లు కొడుతుంటడంతో, వారి కుటుంబం మొత్తం ఆత్మరక్షణలో పడింది.
నెపోటిజం చర్చకు ఆలియా ప్రధాన వేదికగా మారడంతో, ఆమెపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో కొంతకాలం క్రితం ఆలియా ఇన్స్టా అకౌంట్ లో కామెంట్ సెక్షన్ ను నిలిపివేసింది. అయితే రోజులు గడుస్తున్నా వారి కుటుంబం పట్ల జనాలకు ఏమాత్రం కనికరం కలగలేదనే తెలుస్తోంది. తాజాగా ఆలియా తల్లి సోనీ రాజ్దాన్ కూడా సోషల్ మీడియా లో వెనక్కు తగ్గిన వైనం దీనికి ఊతమిస్తోంది.

ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ సెక్షన్ ను క్లోజ్ చేసిన సోనీ, ఇలా చేయడం ఎంతో బాధాకరమని ఓ సుధీర్ఘమైన పోస్ట్ ను పెట్టారు. కొంతమంది కక్షసాధింపో లేదా, ఎవరైనా డబ్బులిచ్చి ఇలాంటి ట్రాలింగ్ ను ఉసిగొల్పుతున్నారో తెలియడం లేదని, కానీ, ఇలాంటి జనాలకు ట్రాలింగ్ చేసేందుకు మరో లక్ష్యం దొరికేంతవరకూ ఇలా చేయక తప్పదని స్పష్టం పోస్ట్ చేశారు.


Click it and Unblock the Notifications











