ప్రీతి జింటాకు చేదు అనుభవం.. పాత ప్రియుడి ప్రతీకారం..
బాలీవుడ్ నటి, వ్యాపారవేత్త ప్రీతి జింటాకు చేదు అనుభవం ఎదురైంది. తన పాత ప్రియుడు నెస్ వాడియా పాత కక్షలను మనసులో పెట్టుకొని ప్రీతి జింటాపై ప్రతీకారం తీర్చుకోవడం ఇండస్ట్రీల వర్గాల్లో చర్చనీయాంశమైంది. దాంతో బాలీవుడ్‌కు ఎయిర్‌పోర్టులో అవమానం ఎదురైంది. తనకు జరిగిన అవమానంపై ప్రీతి జింటా ఎలా స్పందిస్తారోననే విషయం ఆసక్తిగా మారింది. వివరాల్లోకి వెళితే..

ముంబై నుంచి ఢిల్లీకి వెళ్తుండగా
ఐపీఎల్‌లో భాగంగా మొమాలిలో ఇటీవల ఢిల్లీ, కింగ్స్ ఎలెవెన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కోసం ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లడానికి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నది. అయితే గో ఎయిర్ ఫ్లయిట్‌ల ఎక్కడానికి వీలులేదని ప్రీతీకి సిబ్బంది చెప్పడంతో షాక్‌కు గురైంది.

ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడంతో
గో ఎయిర్ విమాన సంస్థకు నెస్ వాడియా యజమాని. గతంలో నెస్‌తో ప్రీతి జింటాకు ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టింది. దాంతో గో ఎయిర్‌లో ప్రయాణించకుండా నెస్ వాడియా ఆమెపై ఆంక్షలు విధించాడు. ఈ క్రమంలోనే ప్రీతిని సిబ్బంది విమానంలో ప్రయాణించకుండా అడ్డుకొన్నారు.

సిబ్బందితో ప్రీతి జింటా గొడవ
గో ఎయిర్‌లో ప్రీతి జింటాకు బోర్డింగ్ పాస్ ఇవ్వకుండా నిరాకరించారు. దాంతో ఆమె వారితో తగువులాడింది. మాకు పై అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అందుచేత మీకు బోర్డింగ్ పాస్ ఇవ్వలేం అని చెప్పడంతో సిబ్బందిపై ప్రీతి జింటా భగ్గుమన్నది. బోర్డింగ్ పాస్ ఇచ్చేంత వరకు కదిలేదని కౌంటర్ వద్ద ధర్నా చేసినంత పని చేసింది.

దియా మిర్జా, ప్రీతి కలిసి
అదే సమయంలో ఎయిర్‌పోర్టులో కలిసిన దియా మిర్జాతో ప్రీతి జింటా టిఫిన్ చేస్తుండగా గోఎయిర్ సిబ్బంది విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉందని హెచ్చరించారు. దాంతో దియా మధ్యలోనే టిఫిన్ వదిలేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా ప్రీతిని విమానం ఎక్కకుండా గో ఎయిర్ సిబ్బంది అడ్డుకోవడంతో ఆమె అందులో ప్రయాణించలేకపోయింది.

ప్రీతి జింటాకు చేదు అనుభవం
గో ఎయిర్ ఘటనపై ప్రీతి జింటా సన్నిహితులు స్పందించారు. వాస్తవానికి ఆమె జెట్ ఎయిర్‌వేస్‌లో ప్రయాణించాల్సింది. కానీ ముంబైలో జరిగిన ఫ్యాషన్ షోలో పాల్గొనడం కారణంగా ఆమె ఆలస్యంగా లేచింది. దాంతో ఆ విమానం మిస్ అయింది. దాంతో గో ఎయిర్ కోసం ప్రయత్నించింది. అయితే ఆమెను అందులో ప్రయాణించకుండా అడ్డుకోవడం కొంత ఇబ్బందికి గురయ్యారు అని వారు అన్నారు.

నెస్ వాడియాపై ప్రీతి కేసు
ఇక ముందు ప్రీతి జింటా గో ఎయిర్ విమానంలో ప్రయాణించదు. ఆమె తీవ్రమైన నిర్ణయం తీసుకొన్నారు అని ఆమె సన్నిహితులు పేర్కొన్నారు. 2015లో వాంఖడే స్టేడియంలో ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్బంగా తనతో ప్రియుడు నెస్ వాడియా అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అని ప్రీతి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నెస్ తండ్రి కోరిక మేరకు ఆమె కేసు ఉపసంహరించుకొన్నారు. కానీ నెస్ మాత్రం ప్రీతిపై ఇప్పటికీ ఆగ్రహంతో ఉన్నారనే విషయం ఈ ఘటనతో అర్ధమైంది.


Click it and Unblock the Notifications











