twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాజీ ప్రియుడితో సీనియర్ హీరోయిన్ కాంప్రమైజ్.. లైంగిక వేధింపులు, కేసు వెనక్కి!

    |

    Recommended Video

    Court Seeks Preity Zinta's Reply On Ness Wadia's Plea

    బాలీవుడ్ సీనియర్ హీరోయిన్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యజమాని ప్రీతి జింతా కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పంజాబ్ జట్టు సహా యజమాని, తన మాజీ ప్రియుడు అయిన నెస్ వాడియాపై ప్రీతి జింతా 2014 లో లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆకేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2014 లో ఈ కేసు నమోదు కావడంతో అప్పటి నుంచి నెస్ వాడియా కోర్టు ఆంక్షలతో ఇబ్బందులు ఎందుర్కొంటున్నాడు.

    ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా

    ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా

    2014 లో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా నెస్ వాడియా తనని లైంగికంగా వేధించాడని ప్రీతి జింతా ముంబైలో కేసు నమోదు చేసింది. ఆ సమయంలో వీరిద్దరూ ప్రేమికులుగా ఉన్నారు. ప్రీతి జింత కేసు పెట్టడం సంచలనంగా మారింది.

    నాలుగేళ్ళ తరువాత

    నాలుగేళ్ళ తరువాత

    సంఘటన జరిగిన నాలుగేళ్ళ తరువాత ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబై పోలీసులు ఛార్జ్ షీట్దాఖలు చేశారు. దీనితో నెస్ వాడియా విదేశాలకు వెళ్లాలంటే ప్రతి సారి కోర్టు అనుమతి తప్పనిసరి. ప్రస్తుతం వాడియా బెయిల్ పై ఉన్నాడు. ఈ నేపథ్యంలో కేసు వలన ఎదురవుతున్న ఇబ్బందులని గమనించిన వాడియా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

    ప్రీతి జింతాతో చర్చలు

    ప్రీతి జింతాతో చర్చలు

    తన లాయర్లు ప్రీతి జింతాతో మాట్లాడి కాంప్రమైజ్ చేయాలని వాడియా ఆదేశించినట్లు తెలుస్తోంది. తన క్లయింట్ కోర్టు ఆంక్షల వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాడియా తరుపున న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. దీనిపై స్పదించేందుకు ప్రీతి జింతా తరుపున న్యాయవాదులు మూడు వారాల సమయం గడువు అడిగారు.

    కేసు వెనక్కి తీసుకునేలా

    కేసు వెనక్కి తీసుకునేలా

    వాడియాపై నమోదు చేసిన కేసుని వెనక్కి తీసుకునేలా రెండు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ప్రీతి జింతా తరుపున న్యాయవాది వివరించారు. ఈ చర్చలు ఓ కొలిక్కి వచ్చేసరికి ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    లైంగికంగా వేధించినా

    లైంగికంగా వేధించినా

    ఈ పరిణామాలన్నీ చూస్తుంటే లైంగిక వేధింపులకు గురైనప్పటికీ ప్రీతి జింతా మాజీప్రియుడితో కాంప్రమైజ్ దిశగా అడుగులు వేస్తున్నట్లు అర్థం అవుతోంది. ప్రీతి జింతా 2016 లో అమెరికాకు చెందిన వ్యాపారవేత్త జెనె గుడ్ ఎనఫ్ అని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

    English summary
    Ness Wadia wants 2014 molestation case dropped. Zinta's advocate told the court that there had been some discussions between both the parties
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X