నవాజుద్దీన్ సిద్ధిఖీపై దెబ్బ పడింది.. నిహారిక సింగ్ లైంగిక ఆరోపణలతో..
బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీకి డిజిటల్ మీడియా కంపెనీ నెట్‌ఫ్లిక్స్ షాకిచ్చింది. నవాజుద్దీన్ సిద్ధిఖీపై బాలీవుఢ్ నటి నిహారిక సింగ్ లైంగిక ఆరోపణలు చేసిన నేపథ్యంలో సెక్రెడ్ గేమ్స్ 2 నుంచి గణేష్ గాయ్‌టోండ్రే పాత్రను నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకొన్నది. ఈ వెబ్ సిరీస్‌లో నవాజుద్దీన్ విలన్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.
నెట్‌ఫ్లిక్స్ సూచన మేరకు సెక్రేడ్ గేమ్స్ 2లోని తన పాత్రకు నవాజుద్దీన్ గుడ్ బై చెప్పే అవకాశం ఉంది అని ప్రముఖ బాలీవుడ్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ అంశంపై నవాజుద్దీన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. అయితే నవాజ్‌కు సెక్రెడ్ గేమ్స్ 2లో సహచర నటి కుబ్రా సెయిత్ మద్దతుగా నిలవడం చర్చనీయాంశమైంది. నవాజ్ అలాంటి వాడు కాదని పేర్కొని నిహారిక సింగ్‌కు షాకిచ్చింది.

సెక్రెడ్ గేమ్స్ రెండో సీజన్ షూటింగ్‌ను సైఫ్ అలీ ఖాన్ ఇటీవలే మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన సన్నివేశాలను శరవేగంగా పూర్తి చేస్తున్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా, వికాస్ బెహల్, నవాజుద్దీన్ కాంబినేషన్‌లో ఫాంథమ్ ఫిలింస్ రూపొందించిన ఘుమ్‌కేతు చిత్రాన్ని నిరవధికంగా వాయిదా వేశారు. వాస్తవానికి ఈ చిత్రం నవంబర్ 16న రిలీజ్ కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











