twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాని సూపర్ హిట్ సినిమాకు భారీ ఆఫర్: రిజెక్ట్ చేసిన దిల్ రాజు, అల్లు అరవింద్

    |

    ఇండియన్ సినిమాలో కొన్నేళ్లుగా రీమేక్‌ల హవా నడుస్తోంది. ఒక భాషలో విడుదలై భారీ విజయాలను అందుకున్న కొన్ని సినిమాలను తమ తమ భాషల్లో పునర్మించేందుకు చాలా మంది దర్శక నిర్మాతలు ముందుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలకు బాలీవుడ్‌లో మాంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో బాలీవుడ్‌లో రీమేక్ అయ్యాయి. గత ఏడాది రూపొందిన 'అర్జున్ రెడ్డి' సైతం భారీ విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే నేచురల్ స్టార్ నాని నటించిన 'జెర్సీ' కూడా అదే పేరుతో రీమేక్ అవుతోన్న విషయం తెలిసిందే.

    బాలీవుడ్ స్టార్ హీరో షాహీద్ కపూర్ హీరోగా హిందీ జెర్సీ రూపొందుతోంది. నాని హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో దీని హిందీ రీమేక్ హక్కులను కూడా తెలుగు ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, దిల్ రాజు తీసుకున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో మాతృకను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా పట్టాలపై ఉండగానే 'జెర్సీ'ని రిలీజ్ చేసేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థలన్నీ ముందుకు వస్తున్నాయి. దీంతో ఈ మూవీకి భారీ డిమాండ్ ఏర్పడింది.

    Netflix Likely To Buy Jersey Remake

    తాజా సమాచారం ప్రకారం.. హిందీ జెర్సీ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ పెట్టుబడుల కంటే మూడు రెట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందట. అదే సమయంలో నెట్‌ఫ్లిక్స్ కూడా దాదాపు వంద కోట్లకు పైగానే సమర్పించేందుకు నిర్మాతలతో చర్చలు జరిపినట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. కానీ, చిత్ర నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ ఈ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించారని ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఇది యూనివర్శల్ సబ్జెక్ట్ కావడంతో సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉండడమేనట. అందుకే ఈ చిత్రాన్ని డైరెక్టుగా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని వాళ్లు భావిస్తున్నట్లు సమాచారం.

    English summary
    Jersey is a 2019 Indian Telugu-language sports drama film written and directed by Gowtham Tinnanuri and is produced by Suryadevar Naga Vamsi under his production banner Sithara Entertainments. Jersey is the official Hindi remake of hit Telugu film of the same name.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X