Don't Miss!
- News ప్రధాని మోదీ ఎదుటే కాలు మీద కాలు వేసుకుని కూర్చొన్న టీడీపీ ఎమ్మెల్యే.. తరువాత రియాక్షన్ ఏమిటంటే..?
- Sports IPL 2024 సీజన్లో చెలరేగేది ఆ కుర్రాడే: సునీల్ గవాస్కర్
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Lifestyle శరీరంలో ఈ భాగాల్లో వాపు కనబడుతుంటే, పక్కా మీ లివర్ డ్యామేజ్ అయ్యిందని అర్థం..!హెచ్చరిక
- Automobiles ప్రతి 14 నిమిషాలకు ఓ కారు మాయం.. అత్యధికంగా కార్లు చోరీ అయ్యేది ఈ నగరాల్లోనే.!!
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
నాని సూపర్ హిట్ సినిమాకు భారీ ఆఫర్: రిజెక్ట్ చేసిన దిల్ రాజు, అల్లు అరవింద్
ఇండియన్ సినిమాలో కొన్నేళ్లుగా రీమేక్‌ల హవా నడుస్తోంది. ఒక భాషలో విడుదలై భారీ విజయాలను అందుకున్న కొన్ని సినిమాలను తమ తమ భాషల్లో పునర్మించేందుకు చాలా మంది దర్శక నిర్మాతలు ముందుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలకు బాలీవుడ్లో మాంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో బాలీవుడ్లో రీమేక్ అయ్యాయి. గత ఏడాది రూపొందిన 'అర్జున్ రెడ్డి' సైతం భారీ విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే నేచురల్ స్టార్ నాని నటించిన 'జెర్సీ' కూడా అదే పేరుతో రీమేక్ అవుతోన్న విషయం తెలిసిందే.
బాలీవుడ్ స్టార్ హీరో షాహీద్ కపూర్ హీరోగా హిందీ జెర్సీ రూపొందుతోంది. నాని హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో దీని హిందీ రీమేక్ హక్కులను కూడా తెలుగు ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, దిల్ రాజు తీసుకున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్లో మాతృకను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా పట్టాలపై ఉండగానే 'జెర్సీ'ని రిలీజ్ చేసేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థలన్నీ ముందుకు వస్తున్నాయి. దీంతో ఈ మూవీకి భారీ డిమాండ్ ఏర్పడింది.
తాజా సమాచారం ప్రకారం.. హిందీ జెర్సీ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ పెట్టుబడుల కంటే మూడు రెట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందట. అదే సమయంలో నెట్‌ఫ్లిక్స్ కూడా దాదాపు వంద కోట్లకు పైగానే సమర్పించేందుకు నిర్మాతలతో చర్చలు జరిపినట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. కానీ, చిత్ర నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ ఈ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించారని ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఇది యూనివర్శల్ సబ్జెక్ట్ కావడంతో సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉండడమేనట. అందుకే ఈ చిత్రాన్ని డైరెక్టుగా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని వాళ్లు భావిస్తున్నట్లు సమాచారం.