Brahmastra బాయ్‌కాట్ చేయండి.. రణ్‌బీర్ బీఫ్ ఫుడ్ వ్యాఖ్యలపై దుమారం! ఇబ్బందుల్లో ఆలియా..
రణ్‌బీర్ కపూర్ అలియా భట్ నటించిన బ్రహ్మాస్త్ర శివ పార్ట్ 1 సినిమా ఈ నెల 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించడంతో తెలుగులో కూడా అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక అమితాబచ్చన్ షారుక్ ఖాన్ కూడా ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. తప్పకుండా సినిమా మొదటి రోజే ఊహించని విధంగా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది అని బాక్సాఫీస్ పండితులు అంచనా వేస్తున్నారు.
దాదాపు 30 కోట్ల వరకు ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో సినిమాకు బాయ్ కాట్ సెగ కూడా గట్టిగానే తగిలేలా ఉన్నట్లుగా తెలుస్తోంది. మొన్నటి వరకు సినిమాపై పెద్దగా నెగిటివ్ టాక్ కాకుండా చిత్ర యూనిట్ సభ్యులు చాలా క్లారిటీతో సినిమాను ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. గతంలో చేసిన కొన్ని కామెంట్స్ కారణంగా అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా సినిమాపై బాయికాట్ ప్రభావం గట్టిగానే పడింది.

అయితే ఇప్పుడు అదే తరహా లో బ్రహ్మాస్త్ర సినిమాకు కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల చిత్ర యూనిట్ మహంకాళి గుడికి వెళ్లడంతో అక్కడ బజరంగ్ దళ్ కార్యకర్తలు రణ్‌బీర్ అలియా భట్ ఇద్దరిని కూడా అడ్డుకున్నారు. ఎందుకంటే గతంలో అలియా భట్ రణ్‌బీర్ కపూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
తాను కూడా బీఫ్ తింటాను అని రణ్‌బీర్ కపూర్ గతంలో చేసిన కామెంట్స్ ను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇలాంటి హీరోల సినిమాలు చూడకూడదు అంటూ నెగిటివ్ టాగ్స్ ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. దీంతో బాయ్ కాట్ సెగ ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ కు కూడా అడ్డుపడుతోంది. బుధవారం రోజు మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని కి వెళ్లిన చిత్ర యూనిట్ సభ్యులు అక్కడ కాలేశ్వరం అమ్మవారిని దర్శించుకోవాలని అనుకున్నారు. అయితే అక్కడ వీరిని హఠాత్తుగా బజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది. బీఫ్ మాంసం తినే విషయంలో వీరిద్దరిపై కూడా వారు అభ్యంతరాలు వ్యక్తం చేసి గుడిలోకి రావద్దు అని నినాదాలు చేశారు. అలాగే బ్రహ్మాస్త్ర సినిమాను కూడా బాయ్ కాట్ చేయాలి అని సోషల్ మీడియాలో కూడా నెగటివ్ ట్యాగ్స్ ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. మరి ఈ ప్రభావం సినిమా కలెక్షన్స్ పై ఎంతవరకు పడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











