హింసను ప్రేరేపిస్తున్న నటి.. అరెస్ట్ చేయాలంటూ డిమాండ్
స్వర భాస్కర్ ఈ పేరు ఉత్తరాదిన బాగా ఫేమస్. ఆ మధ్య ఓ బోల్డ్ వెబ్ సిరీస్‌లో మరింత బోల్డ్‌గా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా రంగంతో అంతో ఇంతో పేరు తెచ్చుకున్న ఈ నటి.. సోషల్ మీడియాలో, మీడియాతో ముచ్చటించేటప్పుడు చేసే కామెంట్లతో మరింత ఫేమస్ అయింది. దేశానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలను వేలెత్తి చూపేలా ఆమె చేసే కామెంట్లతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఈమె పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ దేశ పౌరులెవరో, కానివారెవరో ఆరా తీసి, ఇరుగు పొరుగు దేశాల నుంచి అక్రమంగా వచ్చి ఇక్కడుంటున్నవారిని ఏరి పారేయడానికి చేపట్టిన జాతీయ పౌర రిజిస్టర్ (NRC), జాతీయ పౌర సత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో అల్లర్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్వర భాస్కర్ ఢిల్లీ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై నెటిజన్స్ భగ్గమంటున్నారు. ఈ మేరకు ఆమెను అరెస్ట్ చేయాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు.

స్వర భాస్కర్ గతంలో మాట్లాడిన వీడియోలను షేర్ చేస్తూ ఈమె దేశ ద్రోహురాలంటూ మండి పడుతున్నారు. ఈమెకు పార్లమెంట్‌లో మొత్తం ఎన్ని సీట్లుంటాయో కూడా తెలీదు కానీ మాట్లాడుతోంది, అంబానీ, అదానీల కోసమే మోదీ పని చేస్తారని కామెంట్లు చేస్తోంది కానీ ఆమె వారి ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనల్లో నటించి సొమ్ము చేసుకుంటోందని కామెంట్స్ చేస్తున్నారు. దేశం బయట ఉన్న శత్రువులనుఏరి పారేయడానికి సైన్యం ఉందని, కానీ దేశం లోపల ఉన్న ఇలాంటి వారిని ఏం చేయాలని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.



Click it and Unblock the Notifications











