twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దివ్యభారతి మృతి తెరపైకి.. సుశాంత్,ఇద్దరు హీరోయిన్ల పోస్ట్‌మార్టం అక్కడే.. హాస్పిటల్‌పై అనుమానాలు!

    |

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై అనుమానాలకు అడ్డుకట్ట పడే పరిస్థితి కనిపించడం లేదు. సుశాంత్ మరణం వెనుక మిస్టరీ ఉందనే సందేహాలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. ఆధారాలతో సహ కొందరు ట్వీట్లు చేస్తూ ఏదో కుట్ర జరిగిందంటూ ట్వీట్ల రూపంలో హెరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో దివ్యభారతీ, పర్వీన్ బాబీ, సుశాంత్‌కు దేహాలకు చేసిన కూపర్ హాస్పిటల్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ముగ్గురి మరణాల తర్వాత ఏం జరిగిందంటే..

    ఆ ముగ్గురి పోస్టుమార్టం అక్కడే

    ఆ ముగ్గురి పోస్టుమార్టం అక్కడే


    సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్‌లో మరోసారి అతిపెద్ద కుట్రకు తెరలేసింది. సుశాంత్ మరణానికి ముందు అనుమానస్పదంగా మరణించిన ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు పర్విన్ బాబీ, దివ్యభారతీలను అదే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వాళ్లు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగానే ఆ మరణాలను సూసైడ్‌గా ధృవీకరించి కేసును మూసేశారు. సుశాంత్ కేసులో ముంబై పోలీసులు సరిగా దర్యాప్తు చేయకుటే అదే మళ్లీ రిపీట్ అవుతుంది.సరైన దర్యాప్తు జరగకపోతే ప్రముఖ హీరోయిన్లు పర్వీన్ బాబీ, దివ్యభారతీ మరణాలను సూసైడ్‌గానే ముద్రించి కేసు మూసేస్తారనే విషయాలను ప్రస్తావిస్తున్నారు.

    దివ్య భారతీ మరణం

    దివ్య భారతీ మరణం


    దక్షిణాది, హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న దివ్య భారతీ అనూహ్య పరిస్థితులు, అనుమానాస్పద స్థితిలో మరణించడం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. 1993 ఏప్రిల్ 5వ తేదీన ముంబైలోని అంధేరి వెస్ట్, వెర్సోవాలోని తులసి బిల్డింగ్స్‌లోని ఐదో అంతస్తు కిటికీలో నుంచి పడి గాయాలపాలయ్యారు. ఆ సమయంలో ఫ్యాషన్ డిజైనర్ నీతాలుల్లా, ఆమె భర్త శ్యాం ఉన్నారు. కిందపడిన వెంటనే ఆమెను కూపర్ హాస్పిటల్‌కు తరలించారు. మద్యం సేవించి కింద పడటం ఆమె మరణానికి కారణమని రిపోర్టులో పేర్కొన్నారు.

    72 గంటల తర్వాత పర్వీన్ బాబీ దేహం గుర్తింపు

    72 గంటల తర్వాత పర్వీన్ బాబీ దేహం గుర్తింపు

    ప్రముఖ నటి పర్విన్ బాబీ మరణంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. జనవరి 22 2003లో ఆమె తన ఫ్లాట్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. ఆమె మరణించిన మూడు రోజుల తర్వాత కూడా గుర్తించలేదు. ఆమె ఇంటి ముందు పాల ప్యాకెట్లు, న్యూస్ పేపర్లు మూడు రోజులుగా అక్కడే పడి ఉండటంతో ఆమె మరణాన్ని ఎవరూ గుర్తించలేదనే విషయాన్ని నిర్ధారించారు. ఆమె మరణించిన 72 గంటల తర్వాత గుర్తించి ఆమె దేహాన్ని కూపర్ హాస్పిటల్‌కు తరలించారు.

    సుశాంత్ సింగ్ మరణం తర్వాత

    సుశాంత్ సింగ్ మరణం తర్వాత

    తాజాగా సుశాంత్ సింగ్ మరణం తర్వాత ఆయన పార్దీవ దేహాన్ని కూపర్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ రెండుగంటలపాటు నిర్వహించిన పోస్ట్ మార్టం అనంతరం ఆయన మరణాన్ని సూసైడ్‌గా నిర్ధారించారు. ఊపిరి అందకపోవడం వల్లే సుశాంత్ మరణించాడని పోస్టు మార్టం రిపోర్టులో వెల్లడించారు. ఈ ముగ్గురి మరణాలు అనుమానాస్పదంగా మారడం.. సూసైడ్, సహజ మరణాలు కావు.. హత్య అంటూ ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే.

    సుశాంత్‌ది సహజ మరణం కాదు

    సుశాంత్‌ది సహజ మరణం కాదు

    సుశాంత్ మరణం తర్వాత హీరోయిన్ కంగన రనౌత్‌తోపాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయనను డిప్రెషన్‌కు గురిచేసి.. ఆత్మహత్యకు ప్రేరేపించేలా కొందరు కుట్రపన్నారు. సుశాంత్‌ది ముమ్మాటికి మర్డర్ అంటూ తమ వాదనలను వినిపిస్తున్నారు. ఈ క్రమంలో సుశాంత్ మరణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

    పర్వీన్ బాబీ, దివ్య భారతీ మరణాలకు కారణం

    పర్వీన్ బాబీ, దివ్య భారతీ మరణాలకు కారణం

    పర్వీన్ బాబీ, దివ్యభారతీ మరణాలకు కారణం దర్శకుడు మహేష్‌భట్, నిర్మాత సాజిద్ నడియావాలా అనే ఆరోపణలు మీడియాలో వచ్చాయి. పర్విన్ బాబీతో దర్శకుడు, ఆలియాభట్ తండ్రికి మహేష్ భట్ మధ్య వివాహేతర సంబంధం, అలాగే దివ్యభారతితో నిర్మాత సాజిద్ నడియావాలా ప్రేమ వ్యవహారమే వారి మరణాలకు కారణమని వార్తలు వచ్చాయి. ఆ విషయాలే వివాదాలుగా మారాయని చెప్పుకొంటారు.

    English summary
    Bollywood Sushant Singh Rajput committed suicide on June 14th. Divya Bharati died on April 5th, 1993, Parveen Babi died on 2003 Jan 22. These three actors were taken to JJ Cooper Hospital. Their death were reported as suicide. Netizens are posting that There's some bigger conspiracy going on in Bolly Town. Before Sushant's demise, 2 famous actresses were taken to same "Hospital" & later cases were closed as "Suicide".. Will history gonna repeat or MumbaiPolice will seriously probe this #CBIEnquiryForSushant #SushantSingRajput
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X